Headlines

Cheyutha Pension: కొత్త ఫించన్లపై మరో గుడ్‌న్యూస్.. మళ్లీ గడుపు పెంచిన ప్రభుత్వం.. ఎప్పటివరకంటే?


తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు బిగ్‌ అప్‌డేట్‌. కొత్త పెన్షన్ దరఖాస్తుల పరిశీలన గడువును మరోసారి పెంచుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు ఈ దరఖాస్తుల పరిశీలనకు సెప్టెంబర్ 25 వరకు మాత్రమే ఉండగా.. దాన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ (SERP) సీఈఓ దివ్య దేవరాజన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

ఫీల్డ్ స్థాయి అధికారులు ఎస్ఐఆర్ విధులు, వినాయక నిమజ్జన ఏర్పాట్లు, ఇతర బాధ్యతల్లో బిజీగా ఉండటంతో దరఖాస్తుల పరిశీలనను నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోయారని.. దీంతో దరఖాస్తు పరిశీలన గడువు పొడిగించాలని అధికారులు కోరారని.. వారి చేసిన విజ్ఞప్తుల మేరకు సెర్ప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె స్పష్టం చేశారు.

తాజా ఉత్తర్వుల ప్రకారం, సెప్టెంబర్ 30లోగా చేయూత కొత్త పెన్షన్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సెర్ప్ ఆదేశాలు జారీ చేసింది. అర్హత కలిగిన ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించాలని, అలాగే ఈ ప్రక్రియలో దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది.ఈ ప్రిక్రియ పూర్తైన వెంటనే అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రతి నెల యథావిధిగా ఫించన్‌లు అందుతాయని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *