Viral Video: ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న దేశీ టెస్లా.. డ్రైవర్ నిద్రపోయినా కారు ఆగేది లేదు..! వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. తాజాగా ఒక ఎద్దుల బండి వీడియో నెటిజన్లను…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. తాజాగా ఒక ఎద్దుల బండి వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఎద్దుల బండికి చేసిన ఆవిష్కరణను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. దీని డిజైన్, సాంకేతికతను గమనించిన నెటిజన్లు దీనికి సరదాగా దేశీ టెస్లా అని పేరు పెట్టారు. సాంప్రదాయ ఎద్దుల బండికి ఆధునిక స్పర్శను అందిస్తూ, రైతు సృజనాత్మకతతో రూపొందించిన ఈ వాహనం ఇప్పుడు ఇంటర్నెట్‌లో దుమ్ము రేపుతోంది. ఇంతకీ ఏమిటీ…
మిరియాల అన్నం దక్షిణ భారత ఇళ్లలో చేసుకునే సింపుల్ రైస్ వంటకాల్లో ఒకటి. ముఖ్యంగా ముందురోజు మిగిలిన అన్నాన్ని వృథా చేయకుండా ఉపయోగించేందుకు ఇది మంచి ఆప్షన్. చల్లని వాతావరణంలో వేడివేడిగా మిరియాల అన్నం తినడం హాయిగా అనిపిస్తుంది. మిరియాల్లో ఉండే పైపెరిన్ వంటి సహజ సమ్మేళనాలు ఉన్నప్పటికీ, ఈ వంటకాన్ని జలుబు, దగ్గు లేదా జ్వరానికి దివ్యౌషధం లేదా చికిత్సగా భావించకూడదు. అయితే రుచికరమైన ఇంటి వంటగా మాత్రం తప్పకుండా ప్రయత్నించవచ్చు. 1. కావాల్సిన పదార్థాలు…
MS Dhoni CSK Shares: చెన్నై సూపర్ కింగ్స్‌తో ఎంఎస్ ధోనీ అనుబంధం గురించి కొత్త సమాచారం తెరపైకి వచ్చింది. చెన్నైలో మాజీ కెప్టెన్‌కు దాదాపు లక్ష షేర్లు ఉన్నట్లు క్రిక్ బజ్ నివేదిక పేర్కొంది. వీటి విలువ సుమారు రూ.2.6-3 కోట్లు ఉంటుందని తెలిపింది. అయితే ధోనీకి ఈ వాటా ఉన్న విషయం అధికారికంగా సీఎక్కే ప్రకటించలేదు. సీఎస్కేలో ప్రధాన వాటాదారులు.. హోలిహన్ లౌకీ ఐపీఎల్ బ్రాండ్ వాల్యువేషన్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ విలువ…
మన దేశంలో రైళ్లు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. రైలు ప్రయాణం చేసే సమయంలో పట్టాల కింద, వాటి చుట్టూ చిన్న చిన్న కంకర రాళ్లు కుప్పలుగా కనిపిస్తాయి. వీటిని చాలామంది సాధారణ రాళ్లుగానే భావిస్తారు. కానీ రైల్వే ట్రాక్ నిర్మాణంలో ఈ రాళ్లకు ఎంతో కీలకమైన పాత్ర ఉంది. రైల్వే సాంకేతిక పరిభాషలో వీటిని ట్రాక్ బ్యాలస్ట్ అంటారు. ఒక రైలు ఇంజిన్, కోచ్‌లు కలిపి వందల టన్నుల బరువు ఉంటుంది….
Vinayaka Chavithi: వినాయక చవితి పండుగ రోజున వినాయకుడిని కేవలం ఇళ్లల్లోనే కాకుండా, బయట పెద్ద పెద్ద మండపాలలో ప్రతిష్టించడం వెనుక సామాజిక, చారిత్రక, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంప్రదాయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే: చారిత్రక కారణం స్వాతంత్ర్య ఉద్యమం: బ్రిటిష్ పాలన కాలంలో భారతీయులు రాజకీయ సమావేశాలు జరపడంపై నిషేధం ఉండేది. ప్రజలను ఏకం చేయడానికి స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 1893లో మహారాష్ట్రలో ఈ సామూహిక గణేష్…
న్యూయార్క్ హార్బర్‌లో జరిగిన ఈ ప్రత్యేక డ్రోన్ ప్రదర్శన అక్కడి ప్రజలను ఎంతగానో కదిలించింది. రాత్రి సమయంలో ఆకాశంలో మెరిసిన ఆ డ్రోన్లు సరిగ్గా ట్విన్ టవర్స్ ఆకారాన్ని సంతరించుకోవడంతో, స్థానిక ప్రజలు, మన్‌హాటన్ వాసులు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ అద్భుతమైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. A drone light show featuring one drone for every life lost on 9/11 lit…
ఈ నెల(సెప్టెంబర్) 18 నుంచి నవంబర్ 12 వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగు తుంది. కర్కాటక రాశి కుజుడికి నీచ స్థానం. అయితే, కుజుడికి ఈ రాశి మిత్ర స్థానం కూడా. కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో యుతి చెందడం వల్ల కుజుడికి నీచభంగం జరుగుతుంది. ఫలితంగా కుజుడు మిత్ర క్షేత్ర ఫలితాల్ని మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. సుమారు 55 రోజుల కర్కాటక రాశి సంచారంలో కుజుడు మేషం,…
Lord Shani Dev blessings Telugu: జ్యోతిష్య శాస్త్రంలో శని భగవానుడిని కర్మ కారకుడిగా, న్యాయాధిపతిగా పరిగణిస్తారు. మనిషి చేసే కర్మలకు అనుగుణంగా ఫలితాలను అందించే గ్రహంగా శనికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు శని అధిపతిగా ఉంటాడు. ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన వారు చిన్నతనం నుంచే నిదానంగా ఆలోచించడం, బాధ్యతగా వ్యవహరించడం, ఇతరులకు సహాయం చేయడం వంటి లక్షణాలను కలిగి ఉంటారని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. జీవితంలో ఎన్ని…
అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా.. ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ గణేష్ చతుర్థి వేడుకలు క్రమంగా విస్తరిస్తున్నాయి. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో నివసించే భారతీయులు, ఇతర హిందూ సమాజాలు గణేష్ చతుర్థిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయా దేశాల్లోని హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
తెలుగు చలన చిత్ర సంగీత సామ్రాజ్యానికి పేరుకు తగ్గట్టుగానే చక్రవర్తిలానే ఓ వెలుగు వెలిగారు సంగీత దర్శకుడు చక్రవర్తి. ఆయన తెలుగు సినిమా సంగీతాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు శాసించారు. అగ్ర హీరోల దగ్గర నుంచి వర్ధమాన నటీనటుల వరకు అందరికీ చక్రవర్తి సంగీతమే ఊపిరిగా ఉండేది. ఆయన పాలనలో పాటలు ఊగాయి, పరుగులెత్తాయి, ఉరకలు వేశాయి. దాదాపు 960 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి తన బాణీలతో దశాబ్దం పైగా ఆంధ్ర దేశాన్ని అలరించారు…