Headlines

Andhra Pradesh: ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం ప్రారంభం.. ఇకపై అవి ఫ్రీ..


Andhra Pradesh: ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం ప్రారంభం.. ఇకపై అవి ఫ్రీ..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం పునఃప్రారంభించింది.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులు, నవజాత శిశువుల కోసం ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. ప్రభుత్వం పంపిణీ చేయనున్న కిట్‌లో నవజాత శిశువుకు అవసరమైన 14 వస్తువులు ఉండనున్నాయి. దోమల తెరతో బేబీ బెడ్, వాటర్‌ప్రూఫ్ రబ్బర్ షీట్, బేబీ డ్రస్, టవల్, బేబీ నెప్కిన్లు – 3, జాన్సన్స్ బేబీ పౌడర్ – 200 గ్రాములు, జాన్సన్స్ బేబీ షాంపూ – 100 మి.లీ, బేబీ ఆయిల్ – 200 మి.లీ, బేబీ సోప్, సోప్ బాక్స్, శిశువుల ఆరు బొమ్మలు, సామగ్రి తీసుకువెళ్లేందుకు బ్యాగ్ వంటివి ఈ కిట్‌లో ఉంటాయి. నవజాత శిశువుల ఆరోగ్యం, తల్లి బిడ్డల సంరక్షణ ధ్యేయంగా గతంలో ఎంతో ఆదరణ పొందిన ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని తాజాగా కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు పుట్టిన బిడ్డకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమేలక్ష్యంగా పథకాన్ని తిరిగి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలపై ప్రసవ అనంతర ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా శిశు మరణాల రేటును నియంత్రించేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించేలా ప్రోత్సహించడం ఈ పథకం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

ఎన్టీఆర్ బేబీ కిట్ల సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ ఏటా ఏకంగా 51.15 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ భారీ నిధులతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతి సంవత్సరం జన్మించే సుమారు 2.45 లక్షల మంది శిశువులకు ఉచితంగా ఈ విలువైన కిట్లను అందజేయనున్నారు. మార్కెట్లో ఒక్కో కిట్ ధర సుమారు 1400 రూపాయల వరకు ఉంటుంది. కానీ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే బాలింతలకు దీనిని పూర్తిగా ఉచితంగా అందిస్తారు. ఈ కిట్‌లో మొత్తం 14 రకాల అత్యవసర వస్తువులు ఉంటాయి. పుట్టిన బిడ్డకు అవసరమయ్యే దుస్తులు, దోమతెరతో కూడిన ప్రత్యేకమైన పరుపు, వాటర్ ప్రూఫ్ షీట్స్, బేబీ సబ్బు, షాంపూ, మసాజ్ ఆయిల్, పౌడర్, టవల్స్ వంటివి ఉన్నాయి. ఈ వస్తువులన్నీ శిశువు ఆరోగ్యం, పరిశుభ్రతకు ఉపయోగపడతాయి.

ఈ కిట్ల నాణ్యత పరిశీలన, పంపిణీ బాధ్యతలను ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APMSIDC) చూసుకుంటుంది. ఈ పథకం పారదర్శకంగా అమలయ్యేలా చూసుకుంటుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో నేరుగా తల్లులకు ఈ కిట్లను అందిస్తారు. ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ పథకం కింద బేబీ కిట్ల పంపిణీ నిరంతరాయంగా సాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *