TG ICET 2026 Registration: విద్యార్ధులకు అలర్ట్‌.. ఐసెట్‌ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు! ఎప్పటి వరకంటే?

TG ICET 2026 Registration: విద్యార్ధులకు అలర్ట్‌.. ఐసెట్‌ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు! ఎప్పటి వరకంటే?


TG ICET 2026 Registration: విద్యార్ధులకు అలర్ట్‌.. ఐసెట్‌ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు! ఎప్పటి వరకంటే?

హైదరాబాద్‌, మార్చి 25: తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (TG ICET) 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును ఉన్నత విద్యా మండలి మరోసారి పొడిగించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి 23తో ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే దీనిని మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు గడువు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు నెలాఖరు వరకు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

కాగా 2026-27 విద్యా సంవత్సారానికి సంబంధించి ఫుల్‌ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. గతంలో ఒకసారి రిజిస్ట్రేషన్లకు తుది గడువు పొడిగించగా.. తాజాగా మరోమారు తుది గడువు పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి ప్రకటన వెలువరించింది. దీంతో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మార్చి 31వ తేదీ వరకు అవకాశం లభించింది. ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

ఇక ఐసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు మే 13, 14 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రోజుకు 2 సెషన్లలో జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. ఐసెట్‌ ప్రాథమిక కీ మే 29, 2026న విడుదల చేస్తారు. ఫలితాలు జూన్ 19, 2026న ప్రకటిస్తారు.

టీజీ ఐసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *