అదే సమయంలో, ఒక మిక్సీ గిన్నెలోకి ముప్పావు కప్పు పుట్నాలను తీసుకుని, మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ పుట్నాల పిండిని జల్లెడ పట్టి, ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యంపిండిలో కలపండి. జల్లెడ పట్టిన తర్వాత మిగిలిన రవ్వ వంటి పదార్థాన్ని పక్కకు తీసివేయండి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ కారం, అర టీస్పూన్ వాము, రెండు టీస్పూన్ల నల్ల నువ్వులు పావు టీస్పూన్ ఇంగువ వేసి బాగా కలపండి. పిండి కలిపిన తర్వాత, అదే పాన్‌లో రెండు కప్పుల నీళ్లను తీసుకుని వేడి చేయండి. ఈ నీళ్లు బాగా వేడి అవ్వాలి.