Headlines

71 వేల మందికి ప్రభుత్వ గిఫ్ట్.. డీఏ పెంపుపై డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన


రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పింఛనుదారులందరికీ దీపావళి పండుగ రాకముందే తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆ గుడ్ న్యూస్ వచ్చేసింది. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కరువు భత్యం, కరువు సాయం భారీగా పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు ఈ పెంపు ఎంత? ఎవరికి ఎంత లాభం చేకూరనుంది? ఏయే సంస్థల పరిధిలోని సిబ్బందికి ఈ ప్రయోజనం దక్కనుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. విద్యుత్‌ శాఖ అధికారులతో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ ప్రకటన చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించేలా, ప్రభుత్వం డీఏను ఏకంగా 2.543 శాతం పెంచింది. దీంతో ఇంతవరకు ఉన్న డీఏ 19.272 శాతం.. తాజా పెంపుతో 21.815 శాతానికి చేరింది. 2026 జూలై 1వ తేదీ నుంచి ఈ పెంపు వర్తించనుంది. అంటే జూలై నుంచి రిట్రోస్పెక్టివ్‌గా అరియర్స్ కూడా అందనున్నాయి. కార్మిక శాఖ పరిధిలోని లేబర్ బ్యూరో ప్రకటించే అఖిల భారత ధరల సూచీ ఆధారంగా ఈ డీఏ, డీఆర్‌లను ప్రతి ఆరు నెలలకొకసారి అంటే జనవరిలో ఒకసారి జూలై మరోసారి సవరించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సూచీకి అనుగుణంగానే ఇప్పుడు ఈ పెంపును ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఈ తాజా నిర్ణయం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు విద్యుత్ సంస్థల పరిధిలో మొత్తం 71 వేల 360 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. దీనివల్ల ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలపై నెలకు సుమారు 14 కోట్ల 63 లక్షల రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది. ఏ సంస్థలో ఎంత మంది లబ్ధి పొందుతున్నారో ఇప్పుడు వివరంగా చూద్దాం.. నెంబర్‌ 1. టీజీ ట్రాన్స్‌కో. ఇందులో ఉద్యోగులు 3,081 మంది, ఆర్టిజన్లు 3,644 మంది, పెన్షనర్లు 2,469 మంది. మొత్తం లబ్ధిదారులు 9,194 మంది ఉన్నారు. రెండోది టీజీ జెన్‌కో. ఇందులో ఉద్యోగులు 7,197 మంది. ఆర్టిజన్లు 3,544 మంది, పెన్షనర్లు 3,426 మంది ఉన్నారు. మొత్తం లబ్ధిదారులు: 14,167 మంది ఉన్నారు. మూడోది టీజీ ఎస్పీడీసీఎల్ (TG SPDCL) దీనినే దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అంటారు. ఇందులో ఉద్యోగులు 11,719 మంది, ఆర్టిజన్లు 8,493 మంది, పెన్షనర్లు 8,269 మంది ఉండగా ఇందులో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 28,481 మంది. అధిక సంఖ్యలో లబ్ధిదారులు ఉన్న సంస్థ ఇదే. ఇక నాలుగోవది టీజీ ఎన్పీడీసీఎల్ (TG NPDCL) దీనినే ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అంటారు. ఇందులో ఉద్యోగులు: 9,936 మంది, ఆర్టిజన్లు 3,435 మంది, పెన్షనర్లు 6,147 మంది ఉన్నారు. ఇందులో మొత్తం 19,518 మందికి లబ్ది చేకూరనుంది. ఈ విధంగా కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా, క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న ఆర్టిజన్లకు, ఎన్నో ఏళ్లు సేవ చేసి రిటైర్ అయిన పెన్షనర్లకు కూడా ఈ డీఏ పెంపు వర్తించనుంది. కేవలం ఉద్యోగుల సంక్షేమం, జీతాల పెంపు వంటి తక్షణ విషయాలకే పరిమితం కాకుండా.. రాష్ట్ర విద్యుత్ రంగ భవిష్యత్తుపైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాబోయే పదేళ్లలో రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను ముందే అంచనా వేయాలని, అందుకు తగినట్టుగా ఒక పటిష్టమైన దీర్ఘకాలిక విద్యుత్ ప్రణాళికను రూపొందించాలని ఇంధన శాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా గ్రిడ్ల ఆధునీకరణ, విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను నిలపడం, ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడుకుంటూనే సంస్థలను లాభాల బాట పట్టించడం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన రోడ్‌మ్యాప్‌తో ముందుకు వెళ్తోంది. మొత్తానికి చూస్తే, పండుగ వేళ తెలంగాణ విద్యుత్ సిబ్బందికి ప్రభుత్వం అందించిన ఈ కానుక ఎంతో ఊరటనిచ్చే అంశం. పెరుగుతున్న నిత్యావసర ధరల మధ్య ఈ డీఏ పెంపు ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతుందనడంలో సందేహం లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

WhatsApp: వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!

సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు

పక్షవాతం అన్నాడు… ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!

చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *