బాలీవుడ్ పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్ పేరుతో ఒక వ్యక్తి నుండి బెదిరింపు కాల్ వచ్చింది. తమకు రూ.5 కోట్లు ఇవ్వాలని, లేదంటే హత్య చేస్తామని ఆ వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.ఈ ఘటనతో అప్రమత్తమైన తుషార్ కపూర్ వెంటనే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుషార్ కపూర్ వారం రోజుల క్రితమే తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ విషయాన్ని ఇంతకాలం బయటికి వెల్లడించలేదని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.గతంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, టైగర్ ష్రాఫ్‌లను కూడా లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలు బాలీవుడ్లో ఆందోళన రేకెత్తించాయి. 30కి పైగా చిత్రాల్లో నటించి, పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన తుషార్ కపూర్, ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ సోదరుడు. ఈ తాజా బెదిరింపు కాల్ బాలీవుడ్ వర్గాల్లో మరోసారి సంచలనం సృష్టించింది.
మరిన్ని వీడియోల కోసం :