
దిన ఫలాలు (మార్చి 29, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా సాగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలపడతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ బాధ్యతల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. తల్లితండ్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కార దిశగా కొనసాగుతుంది. స్నేహితులతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోండి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ బాధ్యతల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. కొద్దిపాటు ఓర్పుగా పనులన్నీ పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందుతాయి. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య భంగమేమీ ఉండదు. ఉద్యోగం మారే ప్రయత్నాల్లో సంబంధించి ఆశించిన శుభ వార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. మిత్రుల వల్ల వృథా ఖర్చులవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్త అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. జీవిత భాగస్వామికి కాలం కలిసి వస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారంలో భాగస్వాములతో కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి జీవితంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు అందివస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల వల్ల ఇబ్బంది పడతారు. ఇంటా బయటా పని ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను సజావుగా పూర్తి చేస్తారు. మిత్రుల సాయంతో కీలకమైన పనులు సానుకూలపడతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థికంగా సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండకపోవచ్చు. అనుకోకుండా శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. బంధువులతో అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ప్రస్తుతానికి ఫలించకపోవచ్చు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో అదృష్టం కలిసి వస్తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన పనుల్లో బాగా ఒత్తిడి, శ్రమ ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా చక్కబెడతారు. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమికులకు సమయం అనుకూలంగా ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల మీద బాగా శ్రద్ధ పెంచడం జరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఉన్నత వర్గాలతో స్నేహాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి శుభవార్త వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాలలో బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు. వ్యాపా రాలు కలిసి వస్తాయి. ఏ పని తలపెట్టినా వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఇష్టమైన మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. అన్ని విషయాల్లోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొద్దిగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే రోజంతా చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ముఖ్యమైన సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గిపోతాయి. ఆస్తి వివాదం సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి సమస్యేమీ ఉండదు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. విదేశాల నుంచి కూడా ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. పిల్లల విద్యా విషయాల మీద దృష్టి సారిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాలపరంగా రోజంతా సానుకూలంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. ముఖ్యమైన లక్ష్యాలను సకాలం పూర్తి చేస్తారు. కొందరు బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. హామీలు ఉండడం కానీ, వాగ్దానాలు చేయడం కానీ చేయవద్దు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి ఇది సరైన సమయం. పిల్లల నుంచి శుభవార్తవింటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సంతృప్తికర స్థాయిలో లాభాలు పొందు తారు. ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు నిదానంగా దారికి వస్తాయి. రాదనుకున్న సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు ఊహించని పరిష్కారం లభిస్తుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. శ్రమ, తిప్పట, ఒత్తిడి తప్పకపోవచ్చు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగ్గా ఉంటుంది. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. బంధుమిత్రులకు బాగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.