ముందుగా బొమ్మిడాయి చేపలను తీసుకుని బాగా కడిగి వాటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి వాటిని పక్కన పెట్టాలి. ఇక ఇప్పుడు చింతపండును నీళ్లలో వేసుకుని నానబెట్టి రసం తీసుకోవాలి.
గ్యాస్ స్టవ్ వెలిగించి నూదానిలో ఆయిల్అది వేసి వేడయ్యాక దానిలో ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, నాలుగు కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు కలర్ వచ్చే వరకు వాటిని బాగా వే
ఇక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు పచ్చిమిర్చి వేసి వాటిని వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి.
ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి వాటిలో చింతపండు రసం కూడా పోసి వాటిని మరిగించాలి.
చింత పండు పులుసు బాగా ఉడికిన తర్వాత చేప ముక్కలు కూడా వేసి 20 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. చివర్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి బొమ్మిడాయి చేపలను కిందకు దించుకోవడమే. వేడి వేడి అన్నంలో తింటే టేస్టీగా ఉంటుంది.




