వారణాసి:భారతీయ రైల్వేలో ప్రయాణికులకు ఎదురవుతున్న వింత అనుభవాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కన్ఫర్మ్ టికెట్ చేతిలో ఉన్నా, రైలు ఎక్కిన తర్వాత సీటు కనిపించకపోతే ఆ ప్రయాణికుడి పరిస్థితి ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి అనుభవమే వారణాసికి చెందిన ఇషాన్ బాజ్‌పాయ్‌కు ఎదురైంది. రైల్వే వ్యవస్థపై ప్రశ్నలు రేకెత్తిస్తున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కన్ఫర్మ్ టికెట్.. కానీ బెర్త్ మాత్రం మాయం!
వివరాల్లోకి వెళ్తే.. వారణాసికి చెందిన ఇషాన్ బాజ్‌పాయ్ వారణాసి నుంచి గోరఖ్‌పూర్ వెళ్లేందుకు 15132 నంబర్ బీసీవై ఎన్పీఆర్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అతడికి టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది. టికెట్‌పై CNF/A1/54/SU అని ఉండటంతో A1 కోచ్‌లో 54వ నంబర్ సైడ్ అప్పర్ బెర్త్ కేటాయించినట్లు భావించాడు.
రాత్రి 10:45 గంటలకు రైలు ఎక్కిన ఇషాన్ తన బెర్త్ కోసం వెతకడం ప్రారంభించాడు. అయితే కోచ్ మొత్తం పరిశీలించినా 54వ నంబర్ బెర్త్ కనిపించలేదు. అసలు విషయం ఏమిటంటే.. ఆ A1 ఏసీ టూ టైర్ కోచ్‌లో మొత్తం 52 బెర్తులు మాత్రమే ఉన్నాయి. దీంతో 54వ నంబర్ బెర్త్ ఎక్కడుందో తెలియక ఇషాన్ అయోమయానికి గురయ్యాడు.
సోషల్ మీడియాలో వీడియో.. రైల్వేకు ప్రశ్నలు
తనకు ఎదురైన విచిత్ర అనుభవాన్ని ఇషాన్ వీడియో రూపంలో చిత్రీకరించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్టు చేశాడు. కన్ఫర్మ్ టికెట్ ఇచ్చినప్పుడు అందులో పేర్కొన్న బెర్త్ కోచ్‌లో ఎందుకు లేదని రైల్వే అధికారులను ప్రశ్నించాడు. రాత్రి సమయంలో ప్రయాణం చేయాల్సి ఉండగా తనకు సీటు లేకపోతే ఏం చేయాలని ఆవేదన వ్యక్తం చేశాడు. 139 హెల్ప్‌లైన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.
రైల్వే శాఖ స్పందన ఏమిటి?
ఇషాన్ ఫిర్యాదుపై రైల్వే సేవా విభాగం స్పందించింది. అతడి ఫిర్యాదును సంబంధిత అధికారులకు పంపించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా సీట్ల కేటాయింపుపై స్పష్టత కోసం కోచ్‌లోని TTEని సంప్రదించాలని సూచించింది. అయితే 52 బెర్తులు మాత్రమే ఉన్న కోచ్‌కు 54వ బెర్త్ ఎలా కేటాయించారనే ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం రావాల్సి ఉంది.
నెటిజన్ల ఆగ్రహం
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా బెర్త్ దొరకకపోతే ప్రయాణికులు ఎవరిని సంప్రదించాలని ప్రశ్నిస్తున్నారు. టికెట్ బుకింగ్ వ్యవస్థలో ఇలాంటి పొరపాట్లు ఎలా జరుగుతున్నాయో రైల్వే శాఖ వివరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికుడికి కేటాయించిన బెర్త్ నిజంగా తప్పుగా మ్యాపింగ్ అయిందా? లేక టికెట్లో ముద్రణ లేదా సాంకేతిక లోపం జరిగిందా? అన్నది రైల్వే అధికారుల వివరణతోనే స్పష్టమవుతుంది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రైల్వే శాఖ ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది.
వీడియో ఇక్కడ చూడండి..
Travelling on Train 15132 tonight. My ticket confirms A1/54, but the coach has only 52 berths. Being left without your confirmed seat at 10:45 PM, on an overnight journey, is extremely frustrating. Complaint raised on 139. How can this happen? @RailwaySeva @RailMinIndia https://t.co/jSQty1K5PK
— Ishan Bajpai (@IshanBajpai09) November 22, 2026
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..