Headlines

Pocket Rockets Movie: నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’.. ఆకట్టుకుంటోన్న ‘అప్సర’ సాంగ్‌


నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాత‌లు. డిసెంబర్ 11న సినిమా విడుదలకానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్‌గా .. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో న‌టిస్తున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్‌తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మరింత బజ్‌ను పెంచేందుకు మ్యూజికల్ ప్రమోషన్స్‌ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే ‘అప్సర’ అంటూ సాగే మోస్ట్ ఇల్యూష‌న్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు గ్యానీ ఇచ్చిన బాణీ, గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రమేష్ కుమార్ సాహిత్యం, జేడీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ లిరికల్ వీడియో మాత్రం హీరో, హీరోయిన్ కెమిస్ట్రీని, వారి మధ్య ఉన్న ప్రేమను గొప్పగా చూపించేలా పాట‌ను రూపొందించారు.

ఈ సినిమాలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్లు ఫేమ్), శ్రియా కొంతం (శుభం ఫేమ్), నిర్మల్ (డెబ్యూ హీరో), జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి ఎదురోలు రాజు కెమెరామెన్‌గా, అన్వల్ అలీ ఎడిటర్‌గా వర్క్ చేశారు. ఈ సినిమాని డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నారు.

న‌టీన‌టులు:

త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్లు ఫేమ్), శ్రియా కొంతం (శుభం ఫేమ్), నిర్మల్ (డెబ్యూ హీరో), జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు నటిస్తున్నారు.

  • బ్యానర్స్‌: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్
  • నిర్మాతలు: పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి
  • దర్శకుడు :రుద్ర అత్రి
  • కెమెరామెన్ :ఎదురోలు రాజు
  • మ్యూజిక్ :గ్యానీ
  • ఎడిటర్ : అన్వర్ అలీ
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమేష్ మన్యం
  • ప్రొడక్షన్ డిజైనర్ :విష్ణు వర్దన్ పుల్లా
  • యాక్షన్ కొరియోగ్రఫీ :రాజేష్ లంకా
  • కొరియెగ్రాఫర్ : జేడీ మాస్టర్
  • కాస్ట్యూమ్ డిజైనర్ : అనుషా దేవర
  • ఎస్ఎఫ్ఎక్స్ :సాయి మనీంధర్ రెడ్డి
  • కో డైరెక్టర్ :మురళీ కృష్ణ కట్టా
  • మేకప్ చీఫ్ :పసుపులేటి రవి కుమార్
  • కాస్ట్యూమ్ చీఫ్ :ఆర్. భూపాల్ రావు
  • ప్రొడక్షన్ కంట్రోలర్ : రవిందర్ బెక్కం
  • స్టిల్స్ : వరాహాల మూర్తి
  • ఈవెంట్ పార్టనర్: యువి మీడియా
  • మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ
  • పీఆర్వో : ఎస్.కె. నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)

పాకెట్ రాకెట్స్ నుంచి అప్సర సాంగ్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *