
ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి చిత్రం ప్రస్తుతం సెట్స్ మీద ఉండగానే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. రాజమౌళి రికార్డు, మహేష్ బాబు ఫామ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, సినిమా విజయం సాధిస్తే దాని క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ విషయంలో ఒక నిర్మాత చేసిన ట్వీట్ కొత్త డిస్కషన్‌కు దారితీసింది. వారణాసి సినిమా వర్కింగ్ టైటిల్ ఎస్ఎస్ఎంబీ29 రివీల్ అయినప్పటి నుంచి, ఎస్ఎస్ఆర్13 అనే మరో హాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది. నిర్మాత శోభు యార్లగడ్డ తన సోషల్ మీడియాలో సినిమా క్రెడిట్ ఎప్పుడూ దర్శకుడికే చెందుతుందని ప్రకటించారు. సినిమా పూర్తిగా దర్శకుడి ఆలోచన నుంచే పుడుతుందని, అందుకే ప్రాసెస్ క్రెడిట్ దర్శకుడికే ఇస్తారంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.