Heart Blockage: యువతలో సడెన్‌ హార్ట్‌ ఎటాక్‌ మరణాలు.. దీని వెనుక అసలు కథ ఇదే!

Heart Blockage: యువతలో సడెన్‌ హార్ట్‌ ఎటాక్‌ మరణాలు.. దీని వెనుక అసలు కథ ఇదే!


Heart Blockage: యువతలో సడెన్‌ హార్ట్‌ ఎటాక్‌ మరణాలు.. దీని వెనుక అసలు కథ ఇదే!

గుండె ధమనులలో కొవ్వు లేదా కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీనివల్ల గుండెకు తగినంత రక్తం, ఆక్సిజన్ అందక గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. వైద్య పరిభాషలో దీనిని కరోనరీ ఆర్టరీ వ్యాధి అంటారు. అయితే గుండెలో ఈ అడ్డంకి అకస్మాత్తుగా ఏర్పడదు. దీర్ఘకాలిక ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఇది సంభవిస్తుంది. ఈ సమస్య లక్షణాలు చాలా కాలం క్రితమే కనిపించినప్పటికీ, చాలా మంది వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదం అంచులకు చేరుతుంటారు.

కరోనరీ ఆర్టరీ వ్యాధి లక్షణాలు ఏమిటి?

గుండెలో అడ్డంకికి అత్యంత సాధారణ లక్షణం ఛాతీ నొప్పి. ఛాతీలో ఒత్తిడి వంటి నొప్పి ఉంటుంది. ఈ నొప్పి కొన్నిసార్లు ఎడమ చేయి, భుజం, మెడ నుంచి దవడకు వ్యాపిస్తుంది. కొంతమంది మామూలుగా నడుస్తున్నప్పుడు కూడా ఆయాసపడుతుంటారు. గుండెకు సరైన మోతాదులో రక్తం అందకపోవడం వల్ల శరీరానికి ఆక్సిజన్ లోపిస్తుంది. దీనివల్ల స్వల్ప శారీరక శ్రమ చేసినా కూడా శ్వాస వేగంగా సాగుతుంది. అంతేకాకుండా అకస్మాత్తుగా తల తిరగడం, కారణం తెలియకుండా చెమట పట్టడం కూడా గుండె సంబంధిత సమస్యలకు సంకేతాలు కావచ్చు.

ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంది?

వైద్యుల ప్రకారం కుటుంబంలో గుండె జబ్బులు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కరోనరీ ఆర్టరీ వ్యాధి లక్షణాలు. ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉందో తెలిసింది కాబట్టి గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం వంటివి అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *