ప్రస్తుతం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా సస్పెన్స్, హారర్ సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సిరీస్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మనం మాట్లాడుకుంటున్న సిరీస్ పేరు ది ప్రిడేటర్ ఆఫ్ సెవిల్లే. మార్చి 27న ఈ సిరీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రపంచవ్యాప్తంగా పేరున్న అందమైన టూరిస్ట్ స్పాట్ వెనుక, ఒక క్రూరమైన మృగం దాచిపెట్టిన చీకటి కోణాలను ఈ సిరీస్ ప్రతి ప్రేక్షకుడి కళ్లముందు ఉంచుతుంది. నమ్మకమే ఆయుధంగా చేసుకున్న ఓ మృగం. స్పెయిన్ లోని సెవిల్లే సిటీకి ప్రపంచవ్యాప్తంగా టూరిస్ట్ స్పాట్ గా మంచి పేరు ఉంది. అక్కడ చారిత్రక కట్టడాలను చూసేందుకు అక్కడి సంస్కృతిని తెలుసుకునేందుకు నిత్యం చాలా మంది అక్కడకి వస్తుంటారు.
అక్కడే ఉండే లోకల్ టూర్ గైడ్ ను అందరూ మను వైట్, ప్రిన్స్ ఆఫ్ సెవిల్లే అని పిలిచేవారు. అతడు చూడటానికి చాలా సరదాగా ఉండేవాడు. అందుకే అతడిపై అక్కడకు వచ్చే స్టూడెంట్స్ కు నమ్మకం ఎక్కువ. ఆ తర్వాత విద్యార్తులతో అతడి ప్రవర్తించిన తీరుపై ఓ స్టూడెంట్ ధైర్యం చేసి బహిరంగంగా వెల్లడించింది. వెలుగులోకి వచ్చిన అనేక విషయాలు తెలిసి ప్రపంచమే షాకయ్యింది. నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సిరీస్ ఓటీటీలో దూసుకుపోయింది.
ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. పర్యాటక ప్రదేశంలో జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. . టూర్ గ్రూప్స్, స్టూడెంట్ ప్రోగ్రామ్స్‌లో ఉన్న సిస్టమ్ లోపాల వల్ల ఒక క్రిమినల్ ఇన్నేళ్లుగా దర్జాగా ఎలా తప్పించుకున్నాడో ఈ డాక్యుమెంటరీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది.
'ది ప్రిడేటర్ ఆఫ్ సెవిల్' . ఇది యూరప్‌లో చదువుకుంటున్న అమెరికన్ అమ్మాయిల అక్రమ రవాణా కథలను వివరిస్తుంది. మూడు భాగాలుగా ఉన్న ఈ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతుంది. నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఇది.




