
ఛత్తీస్‌గఢ్‌లోని అంబికా నగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ ఘటనలో, తన స్నేహితుడు బ్రిజ్‌లాల్‌ను హత్య చేసి ఇంట్లో పాతిపెట్టిన మిథిలేష్ అనే వ్యక్తి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. రామనవమి రోజు మద్యం తాగడానికి నిరాకరించిన బ్రిజ్‌లాల్‌తో మిథిలేష్ గొడవపడ్డాడు. ఈ క్రమంలో మిథిలేష్ ఫోన్‌ను బ్రిజ్‌లాల్ పగలగొట్టడంతో ఆగ్రహంతో ఊగిపోయిన మిథిలేష్ పక్కనే ఉన్న కర్రతో బ్రిజ్‌లాల్ తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత మిథిలేష్, అతని భార్య రాజకుమారి కలిసి బ్రిజ్‌లాల్ మృతదేహాన్ని తమ ఇంట్లోనే గొయ్యి తవ్వి పాతిపెట్టారు. అనంతరం వారు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి పారిపోయారు. అయితే, కొద్ది రోజులకే మిథిలేష్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. చనిపోయిన తన స్నేహితుడు దెయ్యం రూపంలో కలలోకి వచ్చి అంత్యక్రియలు చేయాలని డిమాండ్ చేస్తున్నాడని భయపడ్డాడు. భయం, అపరాధ భావనను తట్టుకోలేక మంగళవారం రాత్రి మిథిలేష్ పోలీసులకు లొంగిపోయి నేరాన్ని అంగీకరించాడు.
మరిన్ని వీడియోల కోసం :
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్!