
ప్రఖ్యాత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) విజన్ గురించి, అలాగే సినిమా పాటల రచనలో తన అనుభవాలను గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి. పాటలు కేవలం సినిమాకు అనుబంధంగా ఉండటం కాకుండా, ఒక స్వయంప్రతిపత్తి గల కళారూపంగా ఎలా నిలబడాలో వివరించారు. దర్శకుడి స్పష్టమైన కథనం నుండే ఒక పాట జన్మిస్తుందని సిరివెన్నెల చెప్పారు. దర్శకుడికి సన్నివేశంపై ఎంత సుస్పష్టమైన అవగాహన ఉంటే, పాట అంత సహజంగా, ప్రభావవంతంగా రూపుదిద్దుకుంటుందని ఆయన అన్నారు. దీనికి ఉదాహరణగా ఆర్జీవీ తెరకెక్కించిన క్షణక్షణం చిత్రం గురించి చెప్పుకొచ్చారు.. ఆ సినిమా మొత్తంలో రెండే రెండు పాటలకు మాత్రమే చోటు ఉందని వర్మ స్పష్టంగా చెప్పారని, “డబ్బు” అనే ప్రధాన అంశం ఆధారంగా ఒక సన్నివేశాన్ని రాసి, దాన్ని పాటగా మలచమని వర్మ అడిగారని సిరివెన్నెల గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..
క్షణక్షణంలోని జామురాతిరి జాబిలమ్మ పాట వెనుక ఉన్న అరుదైన కథనాన్ని సిరివెన్నెల గారు వివరించారు. దివంగత నటి శ్రీదేవి వంటి అందగత్తెపై బురద పూసి, ఆమెను ఒక గుంటలోకి తోసి, వికారానికి లోను కాకుండా పసిపాపకు జోకొట్టినట్లుగా పాట పాడించడం వర్మ విజన్‌కు నిదర్శనం అన్నారు. “నేను మిగతా పాటల చిత్రీకరణను ఇప్పటికే ప్లాన్ చేశాను. నాకు శ్రీదేవి అందం మాత్రమే కావాలి. మీరు రామాయణం రాసినా, చెత్త రాసినా నేను అనుకున్న విధంగానే చిత్రీకరిస్తాను” అని వర్మ చెప్పిన మాటలు ఆయన స్పష్టతకు నిదర్శనంగా నిలిచాయని సిరివెన్నెల అన్నారు. ఇలాంటి దర్శకుడి విజన్ ఉన్నప్పుడే పాట మరింత ప్రభావవంతంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎక్కువ మంది చదివినవి : Aamani: ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. ఆ హీరో మాట్లాడే తీరు సూపర్ ఉంటుంది.. హీరోయిన్ ఆమని..
ఒక సందర్భంలో వర్మ, సిరివెన్నెల గారు రాసిన “అందనంత ఎత్తా తారా తీరం ఎందుకందనంత అందా” అనే వాక్యాన్ని మార్చమని కోరారని, తద్వారా రచయిత, దర్శకుడి మధ్య సృజనాత్మక స్పర్ధను సూచించారు. అయినప్పటికీ, సిరివెన్నెల పాటలను సినిమా సందర్భం నుండి వేరు చేసి, సార్వత్రిక అనుభూతిని కలిగించేలా రాయడానికి ప్రయత్నిస్తారని తెలిపారు. “భయాన్ని తరిమి, కటిక రాత్రి కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి” వంటి గీతాలు, జోరుగాలిలో జాబిలమ్మ వంటి లాలిపాటలు కేవలం సినిమా కోసమే కాకుండా, ఒక తండ్రి తన పాపకు పాడేలా లేదా ఏ వ్యక్తికైనా ఓదార్పునిచ్చేలా ఉండాలని ఆయన కోరుకుంటారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 62 ఏళ్లలో 2500కు పైగా సినిమాలు.. మహేష్ బాబు సినిమాతో ఫేమస్.. ఈ నటి ఎవరో గుర్తుపట్టారా.. ?
ఎక్కువ మంది చదివినవి : Soundarya : ఆమెను అలా చూసి తట్టుకోలేకపోయాను.. సౌందర్య గురించి ప్రేమ చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..