
దిన ఫలాలు (ఏప్రిల్ 7, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం వల్ల విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన భద్రత, స్థిరత్వం ఏర్పడతాయి. వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఇలా ఉన్నాయి..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గ్రహ బలం వల్ల రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి లాభాలు ఆర్జిస్తారు. సర్వత్రా మీ మాట చెల్లుబాటవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం వల్ల విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. కుటుంబంతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో ఆశించిన భద్రత, స్థిరత్వం ఏర్పడతాయి. వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో గుర్తింపు ఏర్పడుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలను సకాలంలో పూర్తి చేస్తారు. గతంలో మీ నుంచి సాయం పొందినవారు ఇప్పుడు ముఖం చాటేసే అవకాశం ఉంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లలు చదువుల్లో వృద్ధిలోకి వస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక లాభాలు బాగా పెరుగుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు, అవివాహితులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. దూర ప్రాంతం నుంచి ఎదురు చూస్తున్న ఒక శుభ సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాలు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి. అధికారుల వల్ల కొద్దిగా ఒత్తిడికి గురవుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. కొందరు బంధుమిత్రుల తోడ్పాటుతో ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. అష్టమ స్థానంలో రాహువు వల్ల కుటుంబంలో చికాకులు, ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయం అనుకూలంగా ఉంటుంది. బాగా ఆలోచించి ఖర్చు చేయడం మంచిది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయటా పరిస్థితులు బాగా మెరుగ్గా ఉంటాయి. పెండింగులో ఉన్న ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది కానీ, కింది ఉద్యోగులతో సమస్యలు తలెత్తుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలను కొద్దిగా సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో అధికారులకు, సహోద్యోగులకు ఆశించిన సహాయ సహకారాలు అందిస్తారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అయిపోతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆదాయం, ఆరోగ్యాలు చాలావరకు నిలకడగా ఉంటాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. తోబుట్టువులతో వివాదాలు తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. బంధుమిత్రులతో ఒక శుభకార్యంలో పాల్గొంటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కొందరు ఇష్టమైన మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సామాజిక సహాయ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. కుటుంబపరంగా సంపాదన పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. తల్లితండ్రులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా పురోగమిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు, లక్ష్యాలు పెరిగే సూచనలున్నాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగి పోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు ఆశించిన పరిష్కారం లభిస్తుంది. ఇతరుల పనుల కంటే సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు లాభిస్తాయి. అష్టమంలోని గురువు కారణంగా పనులు ఆలస్యం కావడం, తరచూ స్వల్ప అనారోగ్యాలకు గురి కావడం వంటివి జరుగుతుంటాయి. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు గడిస్తారు. ఆర్థిక విషయాల్లో గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. అధికారులు, సహోద్యోగులు ఎక్కువగా మీ మీద ఆధార పడడం జరుగుతుంది. వృత్తి జీవితంలో బిజీ అయిపోతారు. వ్యాపారాలు అనుకూలంగా సాగిపో తాయి. ఆర్థిక విషయాలు బాగా అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. వృథా ఖర్చుల్ని అదుపు చేస్తారు. సన్నిహితుల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరినీ తేలికగా నమ్మకపోవడం మంచిది. కొత్త ఉద్యోగావకాశాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో అశ్రద్ధ పనికి రాదు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలకు విలువనివ్వడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఆస్తి వ్యవహారం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. ఇల్లు గానీ, స్థలంగానీ కొనే విషయం ఆలోచిస్తారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలపై ఖర్చు చేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది.