ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ- తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్.. జర్నీ మరింత సులభం

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ- తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్.. జర్నీ మరింత సులభం


ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ- తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్.. జర్నీ మరింత సులభం

తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన విజయవాడ-కాజీపేట రైల్వే మార్గంలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యధిక రద్దీ కలిగిన ఈ మార్గంలో చేపట్టిన మూడో రైల్వే లైన్ ప్రాజెక్టు పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 219 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ మార్గంలో ఇప్పటికే 199 కిలోమీటర్ల వరకు ట్రాక్ నిర్మాణం, విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి.

మిగిలి ఉన్న స్వల్ప పనులను సైతం రైల్వే శాఖ వేగంగా పూర్తి చేస్తోంది. త్వరలోనే అన్ని పనులను పూర్తి చేసి ఈ రైల్వే లైన్‌ను పూర్తి స్థాయిలో రైళ్ల రాకపోకలకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త లైన్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, ప్రయాణికుల రద్దీ కూడా తగ్గనుంది. అలాగే రవాణా వ్యవస్థలో మార్పులు రానున్నాయి.

అంతేకాదు ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులతో పాటు సరుకుల రవాణాకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే నిత్యం వందలాది రైళ్లు తిరిగే ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గనున్నాయి. ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఆలస్యం కాకుండా, వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయి.ఈ కొత్త లైన్ వల్ల గూడ్స్ రైళ్ల రాకపోకలను కూడా సులభతరం చేస్తుంది.ఈ రైల్వే లైన్‌లో పూర్తి స్థాయి విద్యుదీకరణ ఉండడం వల్ల ఇంధన ఖర్చులు తగ్గడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుంది.

ఈ కొత్త రైల్వే లైన్ రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా రెండు రాష్ట్రాలకు ఆర్థిక వారధిలా పనిచేయనుంది. ఇది అందుబాటులోకి వస్తే ఈ మార్గం వెంబడి ఉన్న పారిశ్రామిక కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్లు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *