ఉప్పెన సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమాతోనే సెన్సేషన్ గా మారిన ఈ చిన్నది ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. అలాగే బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్స్ అందుకుంది.
ఉప్పెన సినిమా తర్వాత కృతిశెట్టి నటించిన బంగార్రాజు సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఆతర్వాత నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ చిన్నది టాలీవుడ్ లక్కీ బ్యూటీగా మారిపోయింది.
కానీ ఆతర్వాత సీన్ రివర్స్ అయ్యింది.. ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. వరుసగా యంగ్ హీరోల సరసన సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దాంతో కృతిశెట్టి సినిమాల స్పీడ్ తగ్గించేసింది. తెలుగులో పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోయింది.
ప్రస్తుతం తమిళ్, మలయాళ సినిమాలో నటిస్తుంది ఈ చిన్నది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రదీప్ రంగనాథ్ తో కలిసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతిశెట్టి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తన లైఫ్ లో ప్రేమ, బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం సింగిల్గానే ఉన్నానని తెలిపింది కృతి. అయితే ఓసారి బ్రేకప్ అయ్యిందని తెలిపింది. ఈ విషయం మా అమ్మకు కూడా తెలుసని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. అదేవిధంగా తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తే సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తా అని తెలిపింది కృతి.




