ఇంధన ట్యాంకర్‌ భారీ పేలుడు !! ఎగిసిపడ్డ మంటలు

ఇంధన ట్యాంకర్‌ భారీ పేలుడు !! ఎగిసిపడ్డ మంటలు


ఇంధన ట్యాంకర్‌ భారీ పేలుడు !! ఎగిసిపడ్డ మంటలు

పనామా కాలువ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పసిఫిక్ మహాసముద్రం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ‘బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్’ కింద జలాల్లో ప్రయాణిస్తున్న ఒక ఇంధన ట్యాంకర్ పేలిపోయింది. ఒక ఫ్యూయల్ ట్యాంకర్‌లో మొదలైన మంటలు ఒక్కసారిగా భారీ పేలుడుకు దారితీశాయి. పేలుడు సమయంలో భారీగా మంటలు వ్యాపించడం వీడియోల్లో కనిపించింది.దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, అగ్నికీలలతో నిండిపోయింది. ఈ ఘటనతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వంతెనపై వాహనాల రాకపోకలు కొనసాగుతుండగా కాలువలో వెళుతున్న ఫ్యూయల్ ట్యాంకర్‌ షిప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో ఆకాశాన్ని తాకేలా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు భయపడిన వాహనదారులు తమ కార్లను వేగంగా నడుపుకుంటూ బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రమాద ఘటనలో నలుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరు సాధారణ పౌరులు, ఇద్దరు ఫైర్ ఫైటర్లు ఉన్నారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. వంతెనపై వాహనాలు ప్రయాణిస్తుండగా పక్కన ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడం, అక్కడి నుంచి చాలా మంది పారిపోవడానికి ప్రయత్నించడం వీడియోలో కనిపించింది. పేలుడు సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమీపంలోని ఇతర ఇంధన ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా నిరంతరం నీటిని చల్లుతూ పెను ప్రమాదాన్ని నివారించారు. ప్రపంచ సముద్ర వాణిజ్యానికి కీలకమైన మార్గంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడుతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ ఘటన కారణంగా కాలువలో నౌకల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని పనామా అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పేలుడుకు దారితీసిన కచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అణుశక్తిలో భారత్ కు మరో విజయం.. క్రిటికాలిటీకి చేరిన కల్పక్కం రియాక్టర్ !!

LPG: ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లపై కొత్త రూల్‌ !!

పోరాటాల పురిటిగడ్డపై సరికొత్త ఉద్యమం !!

చేపల కోసం వల వేస్తే చిక్కింది చూసి జాలరి షాక్‌

సైకిల్‌పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరి.. చరిత్ర సృష్టించిన టీచర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *