Rishab Shetty: చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశా.. ఓటీటీ ట్రెండింగ్ మూవీపై రిషబ్ ప్రశంసలు

Rishab Shetty: చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశా.. ఓటీటీ ట్రెండింగ్ మూవీపై రిషబ్ ప్రశంసలు


ఇటీవల సంచలన విజయం సాధించిన చిన్న సినిమా యూత్. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రణ్ వీర్ బ్లాక్ బస్టర్ ధురంధర్ ది రివేంజ్ ను తట్టుకుని మరీ ఈ మూవీ భారీ కలెక్షన్లు రాబట్టింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిన్న సినిమాకు రికార్డు కలెక్షన్లు వచ్చాయి. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాను ఎగబడి చూసేశారు. సామాన్యులే కాదు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు. తాజాగా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి యూత్ సినిమాను మెచ్చుకున్నారు. ఈ మూవీని చూసిన ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘చాలాకాలం తర్వాత ఒక మంచి సినిమా చూశాను. ఈ మూవీని చూస్తున్నంతసేపు నేను నవ్వుతూనే ఉన్నాను. ‘యూత్’ సినిమాలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. ఈ సినిమా తల్లిదండ్రులకు ఇచ్చిన ఒక గొప్ప బహుమతి. తెరపై నటీనటులంతా చాలా సహజంగా కనిపించారు. ఈ సినిమా డైరెక్టర్ కెన్‌ కరుణాస్‌ ఇండస్ట్రీకి లభించిన ఒక గొప్ప ఆస్తి’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు రిషబ్ శెట్టి. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

27 ఏళ్ల కెన్ కరుణాస్ యూత్ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు మెయిన్ హీరోగా నటించాడు. అనిష్మా అనిల్ కుమార్, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు,మళయాళం, కన్నడ, హిందీ తదితర ప్రభాన భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

రిషభ్ శెట్టి ట్వీట్..

నెట్ ఫ్లిక్స్ లో యూత్ సినిమా ట్రెండింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *