Headlines

Curd: ఎవ్వరికీ తెలియని సీక్రెట్‌.. ఇదొక్కటి కలిపితే వారమైనా పెరుగును ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు!

Curd: ఎవ్వరికీ తెలియని సీక్రెట్‌.. ఇదొక్కటి కలిపితే వారమైనా పెరుగును ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు!


Curd: ఎవ్వరికీ తెలియని సీక్రెట్‌.. ఇదొక్కటి కలిపితే వారమైనా పెరుగును ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు!

వేసవి కాలంలో పెరుగు త్వరగా పులిసిపోవడం అనేది ప్రతి ఇంట్లో ఫేస్ చేసే ప్రధాన సమస్య. అయితే కేవలం ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్కతో మీ ఇంట్లోని పెరుగును 10-15 రోజుల పాటు తాజాగా, తియ్యగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెరుగులోని బ్యాక్టీరియా వల్ల అది తోడుకుంటుంది, కానీ కాలక్రమేణా అదే బ్యాక్టీరియా పెరుగును పుల్లగా మారుస్తుంది. వేడి ఉష్ణోగ్రత వల్ల బ్యాక్టీరియా మరింత వృద్ది చెందే అవకాశం ఉంటుంది. దీని వల్ల పెరుగు త్వరగా పుల్లగా మారుతుంది. కాబట్టి పెరుగులో కొబ్బరి ముక్కను వేయడం వల్ల ఆ పులిసే ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీని వల్ల పెరుగు త్వరగా పుల్లగా మారదు. ఎక్కవ రోజులు ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు.

పెరుగు పుల్లగా అవ్వకుండా ఉండాలంటే ఇలా చేయండి

ఇందుకోసం ముందుగా ఎప్పటిలాగే పాలను తోడుపెట్టి పెరుగును చేసుకోండి. పెరుగు పూర్తిగా తోడుకున్న తర్వాత, ఒక పచ్చి కొబ్బరి ముక్కను తీసుకోండి. ఆ కొబ్బరి ముక్కను నీటితో బాగా శుభ్రం చేసి దాన్ని పెరుగు మధ్యలో మెల్లగా ఉంచండి. ఇప్పుడు ఆ పెరుగున్న పాత్రపై మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. ఇలా చేయడం ద్వారా పెరుగు 10 నుండి 15 రోజుల వరకు అస్సలు పులవకుండా ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు.

ఇవి గుర్తించుకోండి

ఇలా చేయడం ద్వారా పెరుగు రుచిలో సైతం ఎలాంటి మార్పు ఉండదు, పైగా మార్కెట్‌లో దొరికే పెరుగులాగే తియ్యగా ఉంటుంది. ఫ్రిజ్‌లు లేని కాలంలో మన పెద్దలు పెరుగును నిల్వ చేయడానికి ఈ సహజమైన పద్ధతినే వాడేవారట.అయితే ఈ చిట్కా కోసం కేవలం పచ్చి కొబ్బరిని మాత్రమే వాడాలట. ఎండు కొబ్బరి లేదా కొబ్బరి తురుము ఇందుకు పనికి రాదట. అయితే మీ దగ్గర ఎక్కువగా పెరుగు ఉంటే కొంచెం పెద్ద కొబ్బరి ముక్కను వాడండి. ఇంకో విషయం ఒక్కసారి పెట్టిన తర్వాత కొబ్బరి ముక్కను మాటిమాటికీ బయటకు తీయకండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *