Headlines

అరవ రాజకీయాల్లో సంచలనం.. విజయ్ సీఎం కానట్టేనా..? డీఎంకే – అన్నాడీఎంకే చర్చలు..!

అరవ రాజకీయాల్లో సంచలనం.. విజయ్ సీఎం కానట్టేనా..? డీఎంకే – అన్నాడీఎంకే చర్చలు..!


తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడులో విజయ్ సీఎం పదవి చేపడతారా ? అనే చర్చ మొదలైంది. మ్యాజిక్ ఫిగర్‌కు 11 సీట్ల దూరంలో నిలిచిపోయిన విజయ్ సారథ్యంలోని టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ రావాలంటే మరో ఆరుగురు సభ్యులు విజయ్ పార్టీకి జై కొట్టాలి. ఆ ఆరుగురు ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ సైతం ఈ అంశంలో టీవీకే వాదనతో కన్విన్స్ కాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో విజయ్ ప్రమాణస్వీకారం నిలిచిపోయింది. వాస్తవానికి టీవీకే విజయ్ రేపు ప్రమాణం చేయాలనుకున్నారు. కానీ.. గవర్నర్ అనుమతి లభించకపోవడంతో రద్దు చేసుకున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రిసార్ట్ లో ఉండాలని ఎమ్మెల్యేలకు విజయ్ సూచనలు జారీ చేశారు. ఈ క్రమంలో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ద్రవిడ పార్టీలు రెండూ చేతులు కలుపుతున్నట్లు వస్తున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి.

ద్రవిడ పార్టీలు డీఎంకే.. అన్నాడీఎంకే తమ ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.. అన్నాడీఎంకే, డీఎంకే మధ్య తెరవెనుక చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుండటం రాజకీయాల్లో సంచలనంగా మారింది. డీఎంకే ఖాతాలో 59, అన్నాడీఎంకే ఖాతాలో 47 ఉన్నాయి.. అయితే.. బీజేపీ, కాంగ్రెస్‌ కాకుండా రెండు పార్టీల మిత్రపక్షాలు కలిస్తే సభ్యుల సంఖ్య 120కి చేరనుంది. విజయ్ ఇప్పటికీ మెజార్టీ నెంబర్ చూపించకపోవడంతో ద్రవిడ పార్టీలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం..

అయితే.. టీవీకేకు వామపక్షాలు మద్దతునిస్తాయని ప్రచారం జరిగింది. దీనిపై సీపీఐ, సీపీఎం కూడా క్లారిటీ ఇచ్చాయి.. డీఎంకేతో పొత్తు ధర్మాన్ని వదులుకోమని.. టీవీకేకు మద్దతు ఇవ్వమని ప్రకటించాయి. ఈ తరుణంలోనే.. ఐయూఎంఎల్, వీసీకే కూడా ఇంత వరకు స్పందించలేదు..

అయితే.. మొత్తానికి ఇతర సభ్యులు మద్దతు కూడగడితే సాఫీగానే విజయ్ సీఎం సీటు దక్కించుకునే అవకాశం ఉంది. ఒకవేళ అలా జరగని పక్షంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *