అది ఇది వద్దు.. ఉదయాన్నే ఇది ఒక్క గ్లాస్ తాగండి చాలు.. ఆ రోగాలు హాంఫట్..

అది ఇది వద్దు.. ఉదయాన్నే ఇది ఒక్క గ్లాస్ తాగండి చాలు.. ఆ రోగాలు హాంఫట్..


ఆధునిక జీవనశైలిలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ముఖ్యంగా మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బుల ప్రమాదం గణనీయంగా పెరుగుతోంది.. అయితే, ఒక వ్యాధి రావడం అనేది మెరుగైన జీవనశైలి లేకపోవడానికి సూచనగా పరిగణించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. జీవనశైలితోపాటు ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. రోగనిరోధక శక్తి బలంగా ఉండి, శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేస్తుంటే, వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే, అనేక జబ్బులను మందులు, శస్త్రచికిత్సలు లేకుండానే తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఉదాహరణకు, అధిక రక్తపోటు (బీపీ) కోసం ఉపయోగించే మందులు క్యాల్షియం ఛానల్ బ్లాకర్స్, డయూరిటిక్స్ వంటి అనేక రకాలుగా ఉంటాయి. రసాయనిక ఆధారిత మందులు కాకుండా, ఇంట్లో లభించే వస్తువులతోనే పరిష్కారాలను పొందవచ్చు. ముఖ్యంగా, కాకరకాయ రసం తాగడం వల్ల రక్తపోటు తగ్గి, బీపీ మందులు వాడాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.

కాకరకాయ రసం (Bitter Gourd Juice) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం. ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.. ఇంకా బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ రసం చర్మ ఆరోగ్యాన్ని, కాలేయ పనితీరును కూడా మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఈ సహజ నివారణలు, ఔషధాల వలె లక్షణాలను తాత్కాలికంగా తగ్గించడమే కాకుండా, శరీరానికి హానికరం కాని మార్గాల్లో పని చేస్తాయి. సాధారణ మందులు వాడటం వల్ల కిడ్నీ సమస్యలు వంటి విపరీతమైన దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందని, ఒక్కో టాబ్లెట్‌కు 20-30 సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ, చాలామంది ఈ దుష్ప్రభావాలను విస్మరించి, తేలికైన మార్గాలను ఎంచుకుంటారు. ప్రజలు నొప్పి వస్తే వెంటనే దానికి ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటారు.. ఇది మంచి పద్దతి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడమే తెలివైన పని అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధులు వచ్చినప్పుడు బిల్లులు కట్టడానికి బదులు, జీవనశైలిని మెరుగుపరచుకోవడం ద్వారా వాటిని నివారించడం ఉత్తమం..

ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా అనారోగ్య సమస్యలున్నా.. సందేహాలున్నా నేరుగా వైద్య నిపుణులను సంప్రదించండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *