Headlines

AC: ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గుతుందట.. ఈ విషయాలు తెలుసుకోండి..

AC: ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గుతుందట.. ఈ విషయాలు తెలుసుకోండి..


ఎండలు మండిపోతున్నాయి. వేడి తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లలో, ఆఫీసుల్లో ఏసీల వాడకం అనివార్యమైపోయింది. అయితే ఏసీ ఇచ్చే చల్లదనం ఎంత హాయిగా ఉన్నా, నెలాఖరున వచ్చే షాకింగ్ విద్యుత్ బిల్లు సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది. కానీ మీ ఏసీ రిమోట్‌లో ఉండే ఒకే ఒక్క బటన్‌తో మీ విద్యుత్ బిల్లును భారీగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవును.. చాలామందికి ఏసీ రిమోట్ లోని అన్ని ఫీచర్లపై అవగాహన ఉండదు. అందులో అత్యంత కీలకమైనది ఎకో మోడ్ లేదా ఎనర్జీ సేవింగ్ మోడ్ సాధారణంగా మనం ఏసీ ఆన్ చేయగానే అది పూర్తి సామర్థ్యంతో గదిని చల్లబరచడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల కంప్రెషర్ ఎక్కువ విద్యుత్తును లాగుతుంది. అదే మీరు ఎకో మోడ్ ఆన్ చేస్తే, ఏసీ తన పనితీరును స్మార్ట్‌గా మార్చుకుంటుంది. గదిలోని ఉష్ణోగ్రతను బట్టి కంప్రెషర్ వేగాన్ని సర్దుబాటు చేస్తూ, అవసరమైన మేరకే చల్లదనాన్ని అందిస్తుంది. దీనివల్ల దాదాపు 20శాతం నుండి 30శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుందని అంచనా.

ఎకో మోడ్‌తో లాభాలు

ఆర్థిక భారం తగ్గింపు: నెలాఖరులో మీ విద్యుత్ బిల్లులో గణనీయమైన మార్పును మీరు గమనించవచ్చు.

పర్యావరణానికి మేలు: తక్కువ విద్యుత్ వినియోగం అంటే పర్యావరణంపై తక్కువ ఒత్తిడి అని అర్థం.

ఉష్ణోగ్రతలు స్థిరంగా: ఈ మోడ్‌లో గది చల్లబడటానికి సాధారణం కంటే 5-10 నిమిషాలు ఎక్కువ సమయం పట్టవచ్చు. అయితే ఒక్కసారి గది చల్లబడ్డాక, ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

విద్యుత్ పొదుపు కోసం గోల్డెన్ టిప్స్

ఉష్ణోగ్రత సెట్టింగ్:

బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రకారం.. ఏసీని 24 డిగ్రీల సెల్సియస్ వద్ద నడపడం అత్యంత సమర్థవంతమైన పద్ధతి. ప్రతి ఒక్క డిగ్రీ పెంచడం ద్వారా దాదాపు 6శాతం విద్యుత్తును ఆదా చేయవచ్చు. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు స్లీప్ మోడ్ ఆన్ చేయడం వల్ల, గంట గంటకు ఉష్ణోగ్రత స్వల్పంగా పెరుగుతూ శరీరానికి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా కరెంటును కూడా పొదుపు చేస్తుంది.

రెగ్యులర్ సర్వీసింగ్

ఏసీ ఫిల్టర్లలో ధూళి పేరుకుపోతే, గాలిని బయటకు పంపడానికి మెషిన్ ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి ఫిల్టర్లను శుభ్రం చేసుకోవడం ఉత్తమం. ఏసీతో పాటు తక్కువ స్పీడ్‌లో సీలింగ్ ఫ్యాన్ వేయడం వల్ల చల్లని గాలి గది అంతా త్వరగా వ్యాపిస్తుంది. దీనివల్ల ఏసీపై ఒత్తిడి తగ్గుతుంది.

అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం

చాలా సందర్భాల్లో ఏసీ ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు టెక్నీషియన్లు ఈ ఫీచర్ల గురించి వివరించరు. వినియోగదారులు కూడా కేవలం కూల్ బటన్ నొక్కి వదిలేస్తారు. కానీ రిమోట్ లోని ఈ ఎకో బటన్ వాడకం వల్ల అటు పవర్ సేవ్ అవడంతో పాటు డబ్బులు ఆదా అవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *