Headlines

Camphor Benefits: పచ్చ కర్పూరం మీ ఆరోగ్యానికి వరం.. ఈ సీక్రెట్ తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..

Camphor Benefits: పచ్చ కర్పూరం మీ ఆరోగ్యానికి వరం.. ఈ సీక్రెట్ తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..


ప్రకృతిని ఒక వైద్యశాలగా భావిస్తూ, మన చుట్టూ ఉన్న వస్తువులను సక్రమంగా ఉపయోగించుకుంటే ఆరోగ్యం, ఆనందం మన సొంతమవుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి అద్భుతమైన వస్తువులలో పచ్చ కర్పూరం ఒకటి. పచ్చ కర్పూరం ఒక సహజసిద్ధమైన, ఎన్నో ఉపయోగాలు కలిగిన పదార్థం. ఇది ఆధ్యాత్మిక ఆచారాలు, సుగంధ చికిత్స, ఆయుర్వేద ఔషధం, కీటక వికర్షణ, గాలి శుద్ధీకరణ, చర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మనసుపై ప్రశాంత భావాన్ని చూపి, జీవితాన్ని సానుకూలత, ఆనందంతో నింపడానికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

పచ్చ కర్పూరం ఆరోగ్య ప్రయోజనాలు:

పచ్చ కర్పూరం అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది.

జీర్ణ సంబంధిత సమస్యలు: జీర్ణ సంబంధిత సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.

నొప్పులు: గాయాలు, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, రుమాటిక్ నొప్పులకు ఉపశమనం ఇస్తుంది.

శ్వాసకోశ సమస్యలు: దగ్గు, జలుబు, జ్వరం, చలికాలం, వర్షాకాలంలో వచ్చే జలుబును తగ్గించడానికి సహాయపడుతుంది. శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యల నుండి బయటపడడానికి కూడా పచ్చ కర్పూరం బాగా సహాయపడుతుంది.

చర్మ సమస్యలు: మొటిమలు, మచ్చల సమస్యలను తగ్గించడానికి నిమ్మరసంతో కలిపి వాడుతారు. చుండ్రు సమస్యను తగ్గించడానికి కూడా నూనెలో కలిపి పచ్చ కర్పూరాన్ని ఉపయోగిస్తారు.

మానసిక ప్రశాంతత: పచ్చ కర్పూర సువాసన ప్రశాంతతను ఇవ్వడంతో పాటుగా ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది.

ఆధ్యాత్మిక – సంప్రదాయక ప్రయోజనాలు:

పచ్చ కర్పూరానికి ఆధ్యాత్మిక ఆచారాలలో విశేష స్థానం ఉంది. పచ్చ కర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుట ధరిస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందని ప్రతీతి. నిత్య దీపారాధనలో ఒక చిటికెడు పచ్చ కర్పూరాన్ని ఉపయోగిస్తే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని చెబుతారు. పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వుతో కలిపి డబ్బుల పెట్టెలో పెడితే ఎక్కువ ధన లాభం కలుగుతుందని చెబుతూ ఉంటారు పండితులు..

పచ్చ కర్పూరాన్ని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

పచ్చ కర్పూరం ఎన్నో అద్భుత లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ, దానిని వాడేటప్పుడు కొన్ని తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి.

మోతాదు: పచ్చ కర్పూరాన్ని అధిక మోతాదులో వాడకూడదు. అధిక మోతాదు వికారం, వాంతులు, మైకం, మూర్ఛలు వంటి సమస్యలు కలిగించే అవకాశం ఉంది.

కంటికి దూరంగా: పచ్చ కర్పూరం కంటికి తగలకుండా చూసుకోవాలి.

చర్మంపై వాడకం: చర్మంపై నేరుగా, గట్టిగా రుద్దకూడదు. సున్నితంగా అప్లై చేసుకోవాలి. విరిగిన లేదా గాయపడిన చర్మంపై కర్పూర ఉత్పత్తులను ఉపయోగించకూడదు.

సాంద్రత: 11 శాతం కంటే ఎక్కువగా కర్పూరాన్ని వాడకూడదు. అధిక మోతాదులో కర్పూరం పీల్చడం వల్ల ఆపస్మారక స్థితి, కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది.

పచ్చ కర్పూరం గొప్ప లక్షణాలు కలిగిన పదార్థం. రోజు కొంచెం మొత్తంలో తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉండటం, జీర్ణ సమస్యలు మెరుగుపడటం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి, తగిన మోతాదులో, సరైన జాగ్రత్తలతో పచ్చ కర్పూరాన్ని రోజువారీ జీవితంలో ఉపయోగించుకొని చక్కటి ఫలితాలను పొందవచ్చని పేర్కొంటున్నారు నిపుణులు.. అయితే, ఏమైనా అనారోగ్య సమస్యలుంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *