సౌందర్య అకాల మరణం తర్వాత ఆమని ఆమె ఇంటికి వెళ్లారని, అప్పుడు ఎంట్రన్స్‌లో సౌందర్య, ఆమె తండ్రి ఫోటోలు పూలమాలతో ఉండటం చూసి తట్టుకోలేకపోయానని భావోద్వేగానికి లోనయ్యారు. సౌందర్య తల్లి ఒంటరిగా కూర్చొని ఉండటం చూసి, ఆమె పరిస్థితిని తలుచుకుని చాలా బాధపడ్డారని తెలిపారు. కన్నతల్లిగా భర్త, ఇద్దరు పిల్లలను కోల్పోవడం ఎంత కష్టమో అని ఆమని వివరించారు. సౌందర్య దాదాపు వంద సినిమాల్లో హీరోయిన్‌గా నటించిందని, చాలా మంచి ఆర్టిస్ట్ అని ఆమని ప్రశంసించారు. సౌందర్య వృతిపరంగా, వ్యక్తిగతంగానూ చాలా మంచి అమ్మాయి అని, ఎవరి గురించి చెడుగా మాట్లాడదని, తన పని ఏమిటో చూసుకునేదని ఆమని గుర్తు చేసుకున్నారు.