Headlines

వరల్డ్ కప్ గెలవాలంటే ఫస్ట్ అతడితో మాట్లాడు..! అగార్కర్‌కు అశ్విన్ కీలక సూచన

వరల్డ్ కప్ గెలవాలంటే ఫస్ట్ అతడితో మాట్లాడు..! అగార్కర్‌కు అశ్విన్ కీలక సూచన


2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటినుంచే భారత జట్టు కాంబినేషన్‌పై కసరత్తులు ప్రారంభించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా లేని టీమిండియా బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తున్న తరుణంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక కీలక సూచన చేశారు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను మళ్లీ తెరపైకి తేవాలని బీసీసీఐ సెలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘భువనేశ్వర్ కుమార్ విషయంలో సెలెక్టర్లు త్వరగా స్పందించి అతనితో మాట్లాడాలి. అతడిని అన్ని ఫస్ట్ క్లాస్ టోర్నీలు, విజయ్ హజారే ట్రోఫీలు ఆడించి, మళ్లీ పూర్తి ఫామ్‌లోకి తేవాలి. సౌతాఫ్రికా పిచ్‌లపై మనకు భువీ అనుభవం తప్పకుండా అవసరమవుతుంది’’ అని స్పష్టం చేశారు. సౌతాఫ్రికా మైదానాల్లో స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలించే పరిస్థితులు ఉంటాయి కాబట్టి, భువనేశ్వర్ లాంటి సీనియర్ స్వింగ్ మాస్టర్ జట్టులో ఉంటే పేస్ దళానికి కొండంత బలం చేకూరుతుందని అశ్విన్ అభిప్రాయపడ్డారు.

అశ్విన్ డ్రీమ్ టీమ్

వరల్డ్ కప్ కోసం తన దృష్టిలో పక్కాగా అవకాశం దక్కే ఆటగాళ్లు, సందేహంలో ఉన్నవారు, అసలు జట్టులోకి రానివారు అంటూ అశ్విన్ 3 కేటగిరీలుగా ప్లేయర్లను వర్గీకరించారు:

కచ్చితంగా ఉండాల్సిన వారు

శ్రీకర్ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, భువనేశ్వర్ కుమార్.

అవకాశం రావచ్చు – రాకపోవచ్చు

యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.

జట్టులో చోటు లేనివారు
రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, రవి బిష్ణోయ్, శివం దూబే, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్.

పంత్, అభిషేక్‌లకు షాక్..

అశ్విన్ ఎంపిక చేసిన జాబితాలో స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, యువ ఓపెనర్ అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లకు చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వన్డే ఫార్మాట్ పరిస్థితులు, సౌతాఫ్రికా పిచ్‌లకు సెట్ అయ్యే కాంబినేషన్ల ఆధారంగానే తాను ఈ జాబితాను సిద్ధం చేసినట్లు ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *