Headlines

Raksha Bandhan-2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!


రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న గందరగోళానికి పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో రాఖీ పండుగను ఆగస్టు 28, శుక్రవారం జరుపుకోవాలని సూచించారు. శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 28 ఉదయం 9:48 గంటలకు ముగియనుంది. పౌర్ణమి తిథి రెండు తేదీల్లో కొనసాగడం వల్లే రాఖీ పండుగ తేదీపై సందేహాలు తలెత్తినట్లు పండితులు తెలిపారు.

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్‌ను ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది పౌర్ణమి ముగిసే సమయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆగస్టు 28నే పండుగను నిర్వహించడం శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు.

రాఖీ కట్టేందుకు శుభ సమయాలు.. ఆగస్టు 28న ఉదయం 6:23 నుంచి 9:48 గంటల వరకు రాఖీ కట్టేందుకు అనుకూలమైన సమయంగా పేర్కొంటున్నారు. అలాగే మధ్యాహ్నం 12:14 నుంచి 1:05 గంటల వరకు ఉండే అభిజిత్ ముహూర్తం కూడా శుభప్రదమైనదిగా భావిస్తున్నారు. అయితే ప్రాంతాన్ని బట్టి సూర్యోదయం, స్థానిక పంచాంగ వివరాల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చని పండితులు సూచిస్తున్నారు.

ఇక భద్ర కాలం విషయానికి వస్తే.. ఆగస్టు 28న రాఖీ కట్టే సమయానికి భద్ర ప్రభావం ఉండదని చెబుతున్నారు. దీంతో ఆ రోజు ఉదయం నుంచే రాఖీ వేడుకలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు. తేదీపై ఉన్న సందేహాలకు తెరపడటంతో దేశవ్యాప్తంగా అన్నాచెల్లెళ్లు రక్షాబంధన్‌ వేడుకలకు సిద్ధమవుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *