Headlines

EPFOలో కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌.. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో గ్రూప్ ‘A’ అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద యూజీఎస్సీ అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 80 అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో యూఆర్‌ కేటగిరీకి 29, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి 8, ఓబీసీ కేటగిరీకి 18, ఎస్సీ కేటగిరీకి 15, ఎస్టీ కేటగిరీకి10 పోస్టులు ఉన్నాయి. ఇక దివ్యాంగ (PwBD) అభ్యర్థులకు 3 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంపెనీ లా, లేబర్ లాస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్లొమా ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్ధుల వయోపరిమితి కేటగిరీని బట్టి.. యూఆర్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్ధులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు 40 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. PwBD నిబంధనల ప్రకారం గరిష్టంగా 10 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది.

యూపీఎస్సీ EPFO ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 11, 2026వ తేదీ రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.25 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. APFC పోస్టులకు అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. తొలుత పెన్ అండ్ పేపర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (RT) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను తదుపరి దశలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. తుది ఎంపికలో రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ పనితీరును పరిగణనలోకి తీసుకుంటారు. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్-‘A’ ఉద్యోగాన్ని లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ మంచి అవకాశం. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 11, 2026.
  • రాత పరీక్ష తేదీ: డిసెంబర్ 20, 2026.

యూపీఎస్సీ EPFO ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *