Headlines

జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు.. సుమంత్ కేసులో అలసత్వమే కారణమా..?


జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు.. సుమంత్ కేసులో అలసత్వమే కారణమా..?

హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ముత్తు యాదవ్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. మంత్రి కొండా సురేఖ మాజీ OSD సుమంత్ వ్యవహారంలో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సుమంత్‌పై కేసుకు సంబంధించి FIR నమోదు చేయడంలో ఆలస్యం చేయడంతో పాటు, అతడిని పట్టుకునే విషయంలోనూ ఇన్‌స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఉన్నతాధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ముత్తు యాదవ్ కేవలం మూడు వారాల క్రితమే జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన కొద్దికాలానికే ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సుమంత్ వ్యవహారంలో పోలీసుల చర్యలు, దర్యాప్తు తీరుపై ఉన్నతాధికారులు మరింత లోతుగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *