టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేని వివాదంలో చిక్కుకున్నాడు. ఓ నటి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేశాడంటూ నటి ఆరోపించడంతో పోలీసులు పవన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లను తీసి ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ ఇప్పుడిలా అరెస్ట్ కావడం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.