Headlines

Cinema : అల్లుడు ఇల్లరికం వస్తే.. ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..


రొమాంటిక్ కామెడీలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం ఓటీటీలో ఓ సినిమా గురించి చెప్పుకొవాల్సిందే. ఆధునిక సంబంధాలు, వివాహం తర్వాత ఉండే అంచనాల పై హాస్యభరితమైన వ్యాఖ్యానంగా రూపొందించిన ఈ మూవీ ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మనం మాట్లాడుకుంటున్న ఆగస్ట్ 21 నుంచి ఓటీటీలో ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సాంప్రదాయ భావనకు ఒక విభిన్నమైన కోణంలో ఉంటుంది. పావి అనే అమ్మాయి ఒక ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్. పెళ్లయ్యాక తన తల్లిదండ్రులను వదిలి వెళ్లనని పట్టుబడుతుంది. దీంతో తన భార్య కోసం భర్తే తన భార్యతో కలిసి జీవించడానికి వస్తాడు. ఇక్కడే హాస్యభరితమైన కుటుంబ గందరగోళం, సాంస్కృతిక భేదాలు, భార్యాభర్తల బంధానికి ఒక నిజమైన పరీక్ష మొదలవుతాయి.

ఎక్కువమంది చదివినవి :  Comedian Sudhakar: ఒక్క సినిమాకు రూ.30 వేల రెమ్యునరేషన్.. ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన నటుడు సుధాకర్..

ఈ సినిమా విలక్షణమైన కథాంశం దీనిని ఇతర రొమాంటిక్ కామెడీల నుండి భిన్నంగా నిలబెడుతుంది. పెళ్లి తర్వాత అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఎందుకు ఒక సాంప్రదాయక అంచనాగా ఉందనే ప్రశ్నను కూడా ఈ కథ లేవనెత్తుతుంది. ఈ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలతో పాటు కుటుంబ హాస్యం, భావోద్వేగ క్షణాలు కూడా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని ‘ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ’గా కూడా ప్రదర్శించింది. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, ఎం. ఎస్. భాస్కర్ ముఖ్య పాత్రల్లో నటించారు. దీని కథాంశం, నటీనటుల నటన సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి



ఎక్కువమంది చదివినవి :  Eshwar Sai : ఆ టైంలోనే మాధురి నాకు కనెక్ట్ అయ్యింది.. ఆమె చాలా మంచిది.. నోరు విప్పిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి..

మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా పేరు ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’. 2018లో విడుదలైన ఎలాన్ చిత్రం ‘ప్యార్ ప్రేమ కాదల్’కు ఇది స్పిరిచువల్ రీమేక్‌గా తెరకెక్కించారు. మీకు రొమాంటిక్ కామెడీలు, కుటుంబ గందరగోళం , సాంప్రదాయ వివాహ భావనను విభిన్నంగా చూపించే కథలు నచ్చితే, ఈ సినిమా ఒక మంచి ఎంపిక కావచ్చు.

ఎక్కువమంది చదివినవి : Chalaki Chanti: వాడు నా పొట్ట కొట్టాడు.. నాకు అవకాశాలు రాకుండా చేశాడు.. చలాకీ చంటి..

ఎక్కువమంది చదివినవి : Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. హీరోయిన్ ఆమని..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *