Headlines

Gold Prices: బంగారం ధరలు మళ్లీ డౌన్.. కొనుగోలుచేసేవారికి భారీ ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో శనివారం తులం ఎంతంటే..?


బంగారం ధరలు మరోసారి తగ్గుముఖ పట్టాయి. శుక్రవారం రూ.2500కిపైగా తగ్గగా.. శనివారం కూడా మరోసారి పడిపోయాయి. దీంతో పండుగల సీజన్ క్రమంలో గోల్డ్ కొనుగోలుచేసేవారు ఊరట చెందుతున్నారు. డాలర్ బలపడటం, యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై అంచనాలు పెరుగుతుండంతో గోల్డ్ రేట్లు ప్రభావితం అవుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు చెప్పలేమని అంటున్నారు. సెప్టెంబర్ 12న దేశంలోని వివిధ నగరాల్లో బంగారంతో పాటు వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

ఇవాల్టీ బంగారం ధరలు ఇవే..

-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,54,410 వద్ద ప్రస్తుతం కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,540 వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

-ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,410 పలుకుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,540 వద్ద కొనసాగుతోంది.

-చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,410 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,540కు లభిస్తోంది.

-బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,410గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,540 వద్ద ట్రేడవుతోంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,560 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,690గా ట్రేడవుతోంది.

-ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,410 వద్ద కొనసాగుతోండగా. 22 క్యారెట్ల ధర రూ.1,41,540గా ఉంది.

నేటి వెండి ధరలు చూస్తే..

-వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గముఖం పట్టాయి.

-ముంబైలో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతోండగా.. శుక్రవారం రూ.2.45 లక్షల వద్ద స్థిరపడింది

-దేశ రాజధాని ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ.2,44,900 పలుకుతోంది.

-హైదరాబాద్‌లో కేజి సిల్వర్ ధర రూ.2,49,900కు లభిస్తోండగా.. నిన్న రూ.2.50 లక్షలుగా ఉంది.

-చెన్నైలో కిలో వెండి ధర రూ.2,49,900 వద్ద కొనసాగుతోండగా.. శుక్రవారం రూ.2.50 లక్షలుగా ఉంది.

-బెంగళూరులో కిలో సిల్వర్ రేటు రూ.2,44,900 వద్ద ట్రేడవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *