Headlines

PM Kisan: భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చా? కేంద్రం చెప్పిందేమిటి?


PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మోడీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలలో ఒకటి. దేశవ్యాప్తంగా దీని ద్వారా లక్షలాది మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడైన రైతు ఖాతాకు ఏటా రూ.6,000 బదిలీ చేస్తుంది. ఈ డబ్బును ఒక్కొక్కటి రూ.2,000 చొప్పున మూడు విడతలలో బదిలీ చేస్తారు. మీరు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటే పీఎం కిసాన్ పథకం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.

భార్యాభర్తలిద్దరూ ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చా?

మీరు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటే దరఖాస్తు చేసుకునే ముందు పీఎం కిసాన్ పథకం గురించిన కొన్ని ముఖ్యమైన వివరాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. వారిద్దరూ చెరొక వార్షిక మొత్తం రూ.6,000 అందుకోవచ్చా? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంటుంది. పీఎం కిసాన్ పథకం కేవలం ఒక వ్యక్తికి మాత్రమే కాకుండా మొత్తం కుటుంబానికి ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అందువల్ల భార్యాభర్తలిద్దరూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరు. ఇద్దరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే వారిలో ఒకరికి మాత్రమే ఆమోదం లభిస్తుంది. ఒకవేళ మీరిద్దరూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతుంటే, ప్రభుత్వం అందించిన మొత్తాన్ని మీరు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: SBI డెబిట్ కార్డ్ యాక్టివేషన్ చేసుకోవడానికి ఇన్ని మార్గాలు ఉంటాయని మీకు తెలుసా? ఎవ్వరు చెప్పని ఇన్ఫర్మేషన్‌..!

ఇవి కూడా చదవండి



ఈ వ్యక్తులు ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేరు:

  1. ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తికి పీఎం కిసాన్ పథకం ప్రయోజనం లభించదు.
  2. మీరు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వ్యవసాయం కూడా చేస్తే, మీకు ఈ పథకం ప్రయోజనం లభించదు.
  3. మీ భూమి, ఆస్తి మీ పూర్వీకులు లేదా తాతామామల పేరు మీద ఉన్నట్లయితే, మీకు ఈ పథకం ప్రయోజనం లభించదు.
  4. మీకు నెలకు రూ. 10,000 కంటే ఎక్కువ పింఛను వస్తుంటే అటువంటి పరిస్థితిలో కూడా మీరు ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేరు.
  5. దీంతో పాటు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రధాన్‌లు మొదలైనవారు కూడా ఈ పథకం ప్రయోజనాలను పొందలేరు.
  6. అదే సమయంలో భూమి యజమాని డాక్టర్, ఇంజనీర్, లాయర్, సీఏ వంటి మంచి ఉద్యోగంలో పనిచేస్తుంటే, అటువంటి పరిస్థితిలో కూడా మీకు ఈ పథకం ప్రయోజనం లభించదు.
  7. ఈ పథకం లబ్ధి కేవలం పేద, సన్నకారు రైతులకు మాత్రమే లభిస్తుంది.

ఇది కూడా చదవండి: Gold Price: బంగారం, వెండి ధరలకు భారీ షాక్‌.. MCXలో ఎందుకు పడిపోతున్నాయంటే?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *