Headlines

నాతో నాకే పోటీ అంటూ కొత్త ఎస్‌యూవీతో వచ్చేస్తున్న హ్యుందాయ్! రిలీజ్, పూర్తి వివరాలు


కొత్త SUVల కోసం చూస్తున్న భారతీయ కార్ల కొనుగోలుదారులకు మరో ఆసక్తికరమైన ఎంపిక రాబోతోంది. Venue, Creta మధ్యలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకునేలా కొత్త మోడల్‌ను తీసుకురావాలని Hyundai భావిస్తున్నట్లు తెలుస్తోంది. పేరు ఖరారు కావడంతో ఇప్పుడు ఇంజిన్, ధర, ఫీచర్లపై చర్చ మొదలైంది. అయితే వీటిపై కంపెనీ ఇంకా పూర్తి వివరాలను వెల్లడించలేదు.

Venue, Creta మధ్యలో కొత్త పోటీ

భారత మార్కెట్లో Bayonకు ప్రత్యేక స్థానం కల్పించే అవకాశం ఉంది. ఇది Venue కంటే పెద్దదిగా, Creta కంటే కొంత కింద స్థాయిలో ఉండే SUVగా రావచ్చని తెలుస్తోంది. ఈ విభాగంలో ఇప్పటికే Maruti Grand Vitara, Maruti Victoris, Toyota Urban Cruiser Hyryder, Kia Seltos వంటి మోడళ్లు పోటీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వాహనం ద్వారా హ్యుందాయ్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.

ప్రస్తుతం కంపెనీ పేరు, కొన్ని ప్రాథమిక వివరాలను మాత్రమే వెల్లడించింది. ఇంజిన్, గేర్‌బాక్స్, ఫీచర్లు, ధర వంటి కీలక అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతికత, ఆకర్షణీయమైన రూపకల్పనపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇంజిన్‌పై ఉత్కంఠ..

Bayonలో ఎలాంటి ఇంజిన్ ఉంటుందనే విషయాన్ని కంపెనీ ఇంకా ధ్రువీకరించలేదు. అయితే నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉండొచ్చని సమాచారం. CNGకి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని CNG వెర్షన్‌ తీసుకువచ్చే అవకాశంపై కూడా చర్చ జరుగుతోంది.

ప్రపంచ మార్కెట్లలో ఇప్పటికే Bayon పేరుతో SUV ఉంది. అయితే భారత్ కోసం వస్తున్న మోడల్‌లో రూపకల్పన, బాడీ స్టైల్‌లో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. రోడ్లపై కనిపించిన టెస్ట్ మోడళ్లను బట్టి మరింత బాక్సీ SUV రూపం కనిపించే అవకాశం ఉంది. బయటకు వచ్చిన రెండర్లు అధికారికవి కాకపోవడంతో తుది రూపంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *