Headlines

యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు!


యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వైష్ణైవి సోదరుడు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ (సీపీ) సాయి చైతన్య వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిబాబును హత్య చేసిన అనంతరం సంతోష్ ఆంధ్రాకు పారిపోయేందుకు ప్రయత్నం చేశాడని.. పోలీసులు అతడిని ట్రేస్ చేసి నిజామాబాద్ బైపాస్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. తన సోదరి వైష్ణవిని హత్య చేశాడనే ప్రతీకారంతోనే సంతోష్ పథకం ప్రకారం హరిబాబును నరికి చంపినట్లు సీపీ తెలిపారు. ఈ హత్యకు సంతోష్ తల్లితో పాటు మరో ఇద్దరు సోదరుల ప్రోద్బలం కూడా ఉందని పేర్కొన్నారు.

అయితే బెయిల్‌పై బయటకి వచ్చిన హబరిబాబు నిజామాబాద్‌లో ఉంటున్నట్లు తెలుసుకున్న నిందితులు పక్కా ప్రణాళికతో ఈ దారుణానికి పాల్పడ్డారురని తెలిపారు. హరిబాబు కోసం వితుకుతూ వచ్చిన నిందితులు.. అతని కనిపించగానే ముందే తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా అతనిపై దాడి చేసి.. ఆ తర్వాత అక్కడి నుంచి కారులో పారిపోయారని పోలీసులు తెలిపారు.

ఈ దాడిలో నిందితుడి వాడిన స్విఫ్ట్ కారుతో పాటు హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అలాగే ఈ కేసులో ప్రమేయం ఉన్న మిగతావారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని కమిషనర్ తెలిపారు. చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ సాయి చైతన్య ఈ సందర్భంగా హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *