ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!
కెనడాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక చిన్నారి సీటు బెల్టు ధరించేందుకు నిరాకరించడంతో, ఏకంగా విమాన సర్వీసునే రద్దు చేయాల్సి వచ్చింది. భద్రతా నిబంధనలతో విమానం నిలిచిపోవడంతో తోటి ప్రయాణికులందరూ రాత్రంతా విమానాశ్రయంలోనే తీవ్ర అవస్థలు పడ్డారు. పోర్టర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం విక్టోరియా నుంచి టొరంటోకు బయలుదేరేందుకు సిద్ధమైంది. విమానం రన్‌వే వైపు వెళుతుండగా, ఒక చిన్నారి సీటుపై నిలబడి ఉండటాన్ని సిబ్బంది గమనించారు. తల్లిదండ్రులు, సిబ్బంది ఎంత నచ్చజెప్పినా ఆ పాప కూర్చుని బెల్టు…