మన సంస్కృతిలో రావి చెట్టుకు విశేష ప్రాధాన్యత ఉంది. మన ఋషులు పూజ వృక్షంగా గుర్తించారు. 24 గంటలూ ప్రాణవాయువును విడుదల చేసే అతి ముఖ్యమైన చెట్లలో ఇది ఒకటి, దీని కింద గడిపినా, దీని గాలి పీల్చినా, చుట్టూ ప్రదక్షిణలు చేసినా మంచి ప్రాణవాయువు అందుతుందని, ఇంకా ఆ గాలిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయని అంటున్నారు. దీనిలో ఔషధ విలువలు ఉన్నాయని సైంటిఫిక్ పరిశోధనల్లో కూడా తేలింది.
2010వ సంవత్సరంలో రావి ఆకుల కషాయంపై పరిశోధనలు చేశారు. రావి ఆకులను నీటిలో మరిగించి, వడకట్టి, తేనె కలిపి తీసుకున్నప్పుడు పేగుల్లో ఉండే నులిపురుగులు చనిపోతున్నాయని వారి అధ్యయనంలో తేలింది. నులిపురుగులు రక్తహీనత, పేగుల్లో ఇరిటేషన్, బలహీనత, గ్యాస్ సమస్యలకు కారణమవుతాయి. పిల్లల్లో ఎదుగుదల లోపానికి, కడుపు నొప్పికి కూడా నులిపురుగులే కారణం. రావి ఆకుల కషాయం వీటిని తగ్గిస్తాయి.
రావి ఆకుల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, పైపర్ లాంగ్యుమిన్, పైపరిన్ వంటి రసాయన సమ్మేళనాలు శరీర రక్షణ వ్యవస్థలో కీలకమైన బి లింఫోసైట్లను ఉత్తేజపరుస్తాయి. దీని వల్ల శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. రావి ఆకుల కషాయం ఎక్కువ కాలం యాంటీబాడీలు ఉండేలా చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని సైంటిస్టులు నిరూపించారు.
మూర్ఛ లేదా ఫిట్స్ తో బాధపడే వారికి రావి ఆకుల కషాయం మేలు చేస్తుందని అంటున్నారు. ఇది ఫిట్స్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా, సెరటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల పనితీరును మెరుగుపరచి, ఫిట్స్ రాకుండా నివారించడానికి, వాటి తీవ్రతను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. రావి ఆకుల కషాయంలో మైరిసిటిన్, కాంఫెరాల్ పుష్కలంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు శక్తివంతమైన ఎక్స్పెక్టోరెంట్లుగా పనిచేస్తాయి. దగ్గు, కఫం, శ్లేష్మం, ఆస్తమా వంటి సమస్యలున్నప్పుడు ఈ కషాయాన్ని తేనె, యాలకుల పొడి కలిపి వేడిగా తీసుకుంటే ఊపిరితిత్తులు, గొంతు, సైనస్ ప్రాంతాల నుండి కఫాన్ని, శ్లేష్మాన్ని బయటకు పంపించడంలో సహాయపడుతుంది.
రావి ఆకులను పేస్ట్ చేసి, ఆ పసరును దెబ్బలు, పుండ్లు, గాయాలపై పూస్తే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా పనిచేసి, వాటిని మానిపోయేలా చేస్తాయి. ఇందులో ఉండే ఫినోలిక్ కాంపౌండ్స్ శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. రావి ఆకుల కషాయం తాగడం వల్ల పొట్టలో, నోట్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియాలు నాశనం చేస్తాయి




