Headlines

జానీ మాస్టర్‌ వైఫ్‌కు.. దిమ్మతిరిగే షాక్


టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ భార్య సుమలత కార్యవర్గాన్ని రద్దు చేసింది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా సుమలత తన పదవిని కోల్పోయింది. ఈ నిర్ణయంతో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ సుమలత, రఘు మాస్టర్ సభ్యులతో ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశమైంది. ఈ మీటింగ్‌కు మొత్తం 225 మంది డాన్సర్స్ హాజరయ్యారు. ఈ భేటీలో సుమలతకు కేవలం 11 మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. రఘు మాస్టర్‌కు 214 మంది మద్దతు ప్రకటించడంతో సుమలత కార్యవర్గాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చేనెల అక్టోబర్‌ 11న డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని సమావేశంలో వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ

ఐఫోన్‌కు స్క్రీన్‌ ప్రొటెక్టర్‌ అక్కర్లేదు!ఎందుకంటే..

పిల్లలకు దగ్గు సిరప్ ఇచ్చేవారికి కేంద్రం హెచ్చరిక!

స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు.. శంకర్‌ సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే!

చైనా ‘బిలిబిలి’వైపు భారత కంటెంట్ క్రియేటర్ల చూపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *