కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే, వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇంకా ఈ సమస్యలు ఉన్నవారు వీటిని అదే పనిగా తింటే అలసట ఎక్కువవుతుంది.
లో బీపీ ఉన్నవారు వీటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే, ఈ ములక్కాయలు రక్తపోటును తగ్గిస్తాయి.
కాబట్టి లో బీపీతో బాధ పడేవారు వీటికి దూరంగా ఉంటే చాలా మంచిది.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ములక్కాయలు ఎక్కువగా తింటే థైరాయిడ్ గ్రంథిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇవి పరిశోధనల్లో కూడా తేలింది.
ఇంకా ఇప్పటికే అలర్జీ ఉన్నవారు కూడా వీటిని ఎక్కువగా తినకూడదు. కొందరికి ములక్కాయలు తిన్న వెంటనే అలర్జీ వచ్చే అవకాశం ఉంది. అలాంటివారు కూడా వీటిని తీసుకోకూడదు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




