
మన ప్రతి ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి అనేక మొండి వ్యాధులను నయం చేసే శక్తిని కలిగి ఉంది. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని (Immunity) వేగంగా పెంచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ సమస్యలకు తులసి ఒక దివ్యౌషధం.
* రోగనిరోధక శక్తి పెంపు:
తులసిలో ఉండే జింక్, విటమిన్ సి శరీరానికి సహజమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇది బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడుతుంది. ప్రతిరోజూ తులసి కషాయం తాగడం వల్ల సీజనల్ వ్యాధులు దరిచేరవు.
* శ్వాసకోశ సమస్యలకు చెక్:
దగ్గు, ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారికి తులసి అద్భుతంగా పనిచేస్తుంది. తులసి ఆకుల రసాన్ని కొంచెం తేనెతో కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, కఫం త్వరగా తగ్గుతాయి.
* ఒత్తిడి నుండి ఉపశమనం:
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత కోసం తులసి ఎంతో అవసరం. ఇందులో ఉండే ‘అడాప్టోజెన్’ (Adaptogen) అనే పదార్థం మనస్సును ప్రశాంతంగా ఉంచి, ఆందోళనను తగ్గిస్తుంది.
* చర్మ సౌందర్యం:
తులసి రసంలో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు చర్మంపై వచ్చే అలర్జీలను, మొటిమలను నివారిస్తాయి. తులసి ఆకులను పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది.
* జీర్ణక్రియ, కిడ్నీ ఆరోగ్యం:
తులసి రక్తంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. అలాగే కడుపులో గ్యాస్, ఎసిడిటీ సమస్యలను తగ్గించి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
తులసి ఆకులలో పాదరసం (Mercury) కొద్ది మొత్తంలో ఉంటుంది. కాబట్టి వాటిని దంతాలతో అతిగా నమలకుండా నేరుగా మింగడం లేదా టీ రూపంలో తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. తులసి మన ఇంట్లోనే ఉండే ఒక చిన్న ఆసుపత్రి. ప్రకృతి ప్రసాదించిన ఈ వరాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ఎటువంటి ఖర్చు లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..