సినిమాలకు క్రేజ్‌ తీసుకొస్తున్న సెలబ్రిటీ కపుల్‌

సినిమాలకు క్రేజ్‌ తీసుకొస్తున్న సెలబ్రిటీ కపుల్‌


సినిమాలకు క్రేజ్‌ తీసుకొస్తున్న సెలబ్రిటీ కపుల్‌

చిన్న సినిమా పెద్దగా కనిపించాలంటే ఏం చేయాలి? పెద్ద సినిమా ఇంకా ఎక్స్ ట్రా లార్జ్ సైజ్‌లో స్క్రీన్‌ మీద వెలుగులు చిమ్మాలంటే ఏం చేయాలి? మిగిలిన వాళ్లకు లేని ఓ వెసులుబాటు ఇప్పుడు కొందరు స్టార్‌ కపుల్‌కి ఉంది. అందుకే వారేం చేసినా పబ్లిసిటీ ఇన్‌స్టంట్‌గా వచ్చేస్తోంది. నయనతార నిర్మిస్తున్న సినిమా లవ్‌ ఇన్‌స్యూరెన్స్ కంపెనీ. నయనతార ప్రమోషన్లకు హాజరు కావడం మనలో ఎప్పుడైనా ఎవరైనా చూశారా? అంటే ఎప్పుడైనా చూశామా? అని ఆలోచనలో పడాల్సిందే తప్ప, ఆమె ఉన్న ఫ్రేమ్‌లైతే కంటి ముందు కనిపించవు. కానీ, ఆమెను లవ్‌ ఇనస్యూరెన్స్ కంపెనీ ఈవెంట్‌ కి తీసుకొచ్చారు విఘ్నేష్‌ శివన్‌. నటిగా, నిర్మాతగా ఆమెను తీసుకురావడం నా వల్ల కాదంటూనే, భార్యగా పిలిపించుకోగలిగానంటూ భావోద్వేగానికి గురయ్యారు. సేమ్‌ ఇలాంటి సీనే మా ఇంటి బంగారం ఈవెంట్లోనూ రిఫ్లెక్ట్ అవుతుందనే మాటలున్నాయి. పెళ్లికి ముందు సమంత – రాజ్‌ కలిసి పని చేసిన సందర్బాలు చాలానే. ఆ మధ్య విడుదలైన శుభం సినిమాకు కూడా వాళ్లిద్దరికీ క్రెడిట్స్ ఉన్నాయి. అయితే ఆఫ్టర్‌ మేరేజ్‌ వారిద్దరి కంబైన్డ్ ప్రాజెక్ట్ మా ఇంటి బంగారం. ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్ల కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు అభిమానులు. అలాగే అందరి దృష్టిలోనూ ఉన్న మరో సినిమా రణబాలి. రష్మిక – విజయ్‌ పెళ్లికి ముందు స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ పెళ్లయ్యాక రిలీజ్‌ అవుతుంది. ఆ సమయంలో ఇద్దరూ కలిసి మీడియా ముందుకు రావడం ఖాయం. ఆక్షణాలు ఎలా ఉంటాయో ఊహించుకుని మురిసిపోతున్నారు అభిమానులు. మనం విరోష్‌ కోసం ఎదురుచూస్తున్నట్టు నార్త్ లో జెనీలియా రితీష్‌ రాజా శివాజీ కోసం కూడా ఎదురుచూపులున్నాయి. అందరి గురించీ చెబుతున్నారు మా ఆలియా అండ్‌ రణ్‌బీర్‌ గురించి మాట్లాడరా? అన్నది రాలియా ఫ్యాన్స్ నుంచి రెయిజ్‌ అవుతున్న ముచ్చట. వారిద్దరూ కలిసి బ్రహ్మాస్త్ర 2లో నటించాలి. ప్రస్తుతం ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉన్నారు. వీరిద్దరితో సంజయ్‌లీలా భన్సాలీ లవ్‌ అండ్‌ వార్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ రొమాంటిక్‌ డ్రామా కోసం కూడా జనాలు వెయిట్‌ చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఎలాంటిదైనా స్కేల్‌ని అమాంతం పెంచేయడానికి స్టార్‌ కపుల్‌ ప్రెజెన్స్ ప్లస్‌ అవుతుందంటున్నారు ట్రేడ్‌ పండిట్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో

కూతురికి విడాకులు మంజూరు.. కోర్టు బయట బ్యాండ్‌ మేళంతో.. వేడుక చేసిన తండ్రి

నో ఫుడ్‌, నో ఫోన్‌.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్‌ చేస్తే !!

Mrunal Thakur: పెద్దిలో ఐటం సాంగ్‌.. తెలివిగా తప్పించుకున్న మృణాల్‌

మేకోవర్‌ టాపిక్‌.. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్‌, నీల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *