హైదరాబాద్, ఆగస్ట్ 28: నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష మరో రెండు రోజుల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) NEET PG 2026 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. NEET PG 2026 పరీక్షను 2026 ఆగస్టు 30న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 340 నగరాల్లో మొత్తం 1300కు పైగా పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో పరీక్ష జరగనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ అడ్మిట్ కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. హాల్‌టికెట్ లేకుండా పరీక్షా కేంద్రంలోకి అనుమతించే అవకాశం ఉండదు.
NEET PG 2026 అడ్మిట్ కార్డు డౌన్లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
NEET PG 2026 అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
- ముందుగా NBEMS అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- NEET PG 2026కి సంబంధించిన అడ్మిట్ కార్డు లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
- స్క్రీన్‌పై అడ్మిట్ కార్డు కనిపిస్తుంది.
- హాల్‌టికెట్‌లో ఉన్న పేరు, ఫొటో, పరీక్షా కేంద్రం, తేదీ తదితర వివరాలను పరిశీలించాలి.
- అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసిన తర్వాత అందులోని పరీక్షా కేంద్రం చిరునామా, రిపోర్టింగ్ సమయం, అభ్యర్థి వివరాలు, పరీక్ష తేదీ తదితర అంశాలను ముందుగానే పరిశీలించాలి. పరీక్ష రోజున ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పరీక్షా కేంద్రానికి చేరుకునే మార్గాన్ని ముందుగానే తెలుసుకోవడం మంచిది. అభ్యర్థులు పరీక్షకు వెళ్లే సమయంలో అడ్మిట్ కార్డుతో పాటు అవసరమైన ఇతర అవసరమైన పత్రాలను తీసుకెళ్లాలని NBEMS సూచించింది.
ఇవి కూడా చదవండి
NEET PG 2026 అడ్మిట్ కార్డు డౌన్లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.