అనమిక చిత్రం థియేటర్లలో పెద్దగా ఆదరణ పొందకపోయినా, ఒక మల్టీనేషనల్ కంపెనీ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విజయం సాధించిందని గుర్తు చేసుకున్నారు. ఆర్థిక భద్రతను తాను ఎప్పుడూ చూసుకుంటానని, ఆ తర్వాతే బ్లాక్ బస్టర్, భారీ వసూళ్ల గురించి ఆలోచిస్తానని ఆయన వివరించారు. కాగా శేఖర్ కమ్ముల, స్టార్ హీరోయిన్ నయనతార మధ్య పదేళ్ల క్రితం జరిగిన ఓ గొడవ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నయనతార నటించిన చిత్రాలలో అనామిక ఒకటి, దీనికి దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా బాలీవుడ్ లో విద్యా బాలన్ నటించిన సూపర్ హిట్ కహానీకి రీమేక్.