నేషనల్ కాదమ్మా.. ఇక్కడంతా ఇంటర్నేషనల్

నేషనల్ కాదమ్మా.. ఇక్కడంతా ఇంటర్నేషనల్


ఒకప్పుడు ఇండియన్ సినిమాలు మన లోకల్ మార్కెట్‌ను మాత్రమే టార్గెట్ చేస్తే చాలు అనుకునేవాళ్లు దర్శక నిర్మాతలు.. కానీ ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వైడ్‌గా సత్తా చూపే ప్రక్రియ మొదలైంది. ప్రమోషన్స్ నుంచే ఈ పద్దతులు ఫాలో అయిపోతున్నారు మేకర్స్. మరి దీనికోసం ఎవరెవరు ఏం చేస్తున్నారో ఎక్స్‌క్లూజివ్‌‌గా చూద్దాం.. రాజమౌళి ఏం చేసినా ఇంటర్నేషనల్ రేంజ్‌లో మోత మోగుతుందిప్పుడు. బాహుబలి నుంచే ఆయన స్టైల్ మారిపోయింది.. ట్రిపుల్ ఆర్‌కు అది పీక్స్‌కు చేరిపోయింది. ఆస్కార్ వచ్చాక ఆయన ఆలోచనలన్నీ అక్కడక్కడే తిరుగుతున్నాయి. ఇండియన్ సినిమా చేస్తున్నా.. ఇంటర్నేషనల్ ప్లానింగ్‌, ప్యాన్ వరల్డ్ ఐడియాస్‌తో రప్ఫాడిస్తున్నారు జక్కన్న. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా కోసం రాజమౌళి ప్లానింగ్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కు చేరువ చేస్తున్నారు. చేసేది తెలుగు సినిమానే అయినా.. టార్గెట్ మాత్రం గ్లోబల్ ఆడియన్సే అంటున్నారు దర్శక ధీరుడు. ఇప్పటికే హాలీవుడ్ జర్నలిస్టులతో మీటింగ్స్, ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు రాజమౌళి. జూన్ చివర్లో ఫ్రాన్స్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో వారణాసిలోని విజువల్స్‌ను చూపించబోతున్నారు జక్కన్న. మొన్నే మెక్సికో ఈవెంట్‌లో ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు చూపించారు. రామాయణను సైతం ఇదే దారిలో తీసుకెళ్తున్నారు. ఏ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌ను కూడా రామాయణ మేకర్స్ మిస్ అవ్వట్లేదు. 4000 కోట్ల రికవరీ కోసం ప్రపంచాన్నే టార్గెట్ చేస్తున్నారు. టాక్సిక్ కోసం యష్ సైతం ఇదే చేస్తున్నారు. ఇటు రామాయణ, అటు టాక్సిక్‌కు రెండింట్లోనూ ఈయన నటిస్తుండటమే కాదు నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో ఇంటర్నేషనల్ మార్కెట్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఇక అల్లు అర్జున్ రాకా సినిమా సైతం హాలీవుడ్ మేకర్స్‌తోనే టై అప్ అయ్యారు. మొత్తానికి ఇంటర్నేషనల్ మార్కెట్ గ్రాబ్ చేయడానికి మన మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

CM Vijay: ‘వావ్’ అనిపించిన సీఎం విజయ్ తొలి ప్రసంగం

ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !

‘ఐ స్ట్రోక్’ గురించి తెలుసా? నిర్లక్ష్యం చేస్తే అంధత్వమే

ఈ సైలెంట్ కిల్లర్‌తో జాగ్రత్త.. ముఖ్యంగా వృద్ధులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *