స్టఫింగ్ బాల్స్ వేసిన తర్వాత, ఐదు నుండి ఆరు నిమిషాలు ఉడికించగానే అవి పైకి తేలుతాయి. ఒకసారి కలిపి, మీడియం ఫ్లేమ్‌లో మధ్యమధ్యలో కలుపుతూ దాదాపు పావు గంట పాటు ఉడికించుకోవాలి. ఒక స్పూన్ బియ్యంపిండిని ఉండలు లేకుండా కలిపి, ఈ పాలలో వేసుకోవాలి. తరువాత, అర స్పూన్ యాలకుల పొడి వేసి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి. పాలు దగ్గరగా మరిగి, బియ్యం పిండి నీళ్లు చక్కగా ఉడికి, స్వీట్ చిక్కబడుతుంది. ఇది మరీ గడ్డలాగా చిక్కబడకుండా చేసుకోవాలి. చక్కగా తయారైన ఈ స్వీట్‌ను చల్లగా సర్వ్ చేసుకోవచ్చు