టాలీవుడ్ డ్యాన్స్ పరిశ్రమలో నెలకొన్న వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ వివాదం ఇప్పుడు ఫిలిం ఫెడరేషన్ వర్సెస్ జానీ మాస్టర్‌గా రూపాంతరం చెందింది. ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంటూ టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై సహాయ నిరాకరణ విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా జానీ మాస్టర్ ఏ సినిమాకు పనిచేసినా మిగతా 23 క్రాఫ్ట్స్ ఆయనతో సహకరించవని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఫెడరేషన్ నియమ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫెడరేషన్ నాయకత్వం జానీ మాస్టర్‌తో చర్చలకు ప్రయత్నించినప్పటికీ, ఆయన “నాకు ఫెడరేషన్ అవసరం లేదు, నాకు నేనే శాసనం” అనే విధంగా వ్యవహరించారని, అందుకే 72 మంది కౌన్సిల్ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. ఈ వివాదానికి మూలాలు కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య కొంతకాలంగా నడుస్తున్న ఆధిపత్య పోరాటంలో ఉన్నాయి. ప్రస్తుత డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత, కొరియోగ్రాఫర్ల వేతనాల్లో కోత విధించి “రెమ్యూనరేషన్ స్కామ్”కు పాల్పడుతున్నారనే ఆరోపణలతో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, ట్రెజరర్లను సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శేఖర్ మాస్టర్ వర్గానికి చెందిన మరో ఎనిమిది మంది ఈసీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అసోసియేషన్‌లో 10 ఖాళీలు ఏర్పడగా, వాటి భర్తీకి ఉప ఎన్నికలు నిర్వహించాలని సుమలత పట్టుబడుతున్నారు. అయితే, అసోసియేషన్‌ను పూర్తిగా రద్దు చేసి పూర్తి స్థాయి ఎన్నికలకు వెళ్లాలని శేఖర్ మాస్టర్ వర్గం డిమాండ్ చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
ఇండస్ట్రీలో అక్కినేని హీరోల టైం మొదలైందా..?
విజయ్ ‘జన నాయగన్’ ఓపెనింగ్స్ పై ఆసక్తి
టాలీవుడ్లో యాక్షన్ లవ్ స్టోరీల ట్రెండ్
తెలంగాణ పల్లె కథల వైపు టాలీవుడ్ చూపు