గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్‌

గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్‌


గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్‌

గాల్లో ఎగురుతున్న అమెరికా యుద్ధ విమానం ఎఫ్-15 ను ఇరాన్ దళాలు కూల్చేశాయి. అందులోని సెకండ్ పైలట్ గాయాలతో పారాచూట్ సాయంతో ఇరాన్ పర్వత ప్రాంతంలో దిగాడు. అది శత్రువుల ఇలాకా. ఒంటరిగా, గాయాలతో ఉన్న అతడికి చుట్టూ శత్రు సైన్యం కదలికల శబ్దం వినిపించింది. ఆ పరిస్థితుల్లో 24 గంటలకు పైగా గడిపి ప్రాణాలతో ఎలా బయటపడ్డాడు? అతని వైపే ప్రపంచం ఉత్కంఠగా చూసింది. ట్రైనింగ్, క్రమశిక్షణతో అతను ప్రాణాలు కాపాడుకున్నాడనీ అంటున్నారు. విమానం కూలిన వెంటనే పైలట్‌ పర్వతాల మధ్య గుహలో తలదాచుకున్నాడు. ఇరాన్ సెర్చ్ బృందాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయని తెలుసుకున్నాడు. అతని దగ్గర ఉన్నది ఒక పిస్టల్, కమ్యూనికేషన్ పరికరం, ట్రాకింగ్ బీకన్ మాత్రమే. ఒకే చోట ఉంటే దొరికిపోతానని, నిరంతరం స్థానం మార్చుకుంటూ ముందుకు కదిలాడు. అతడిని పట్టిచ్చిన వారికి 60వేల డాలర్లు నజరానా ఇస్తామని ఇరాన్ అధికారులు ప్రకటించారు. దాంతో స్థానికులు కూడా గాలింపులో పాల్గొన్నారు. ఇది పరిస్థితిని మరింత కష్టతరం చేసింది. అయినా ఆ పైలట్‌ ధైర్యం కోల్పోలేదు. సర్వైవల్ ప్రోటోకాల్‌ పాటించాడు. సిగ్నల్ కోసం 7,000 అడుగుల ఎత్తైన పర్వతాన్ని గాయాలతోనే ఎక్కడం అతని ధైర్యానికి, పట్టుదలకు నిదర్శనం. అతని ట్రాకింగ్ బీకన్ కారణంగా అమెరికా సైన్యం అతని కదలికలను రియల్ టైంలో గమనిస్తూనే ఉంది. అమెరికా సైన్యం సాహస రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టింది. సీఐఏ సహాయంతో ఇరాన్ దళాలను తప్పుదోవ పట్టించి, ఆ అధికారి ఉన్న ప్రదేశానికి కమాండోలను పంపింది. అతనికి ఫస్ట్‌ ఎయిడ్‌ అందించి బయటకు తీసుకొచ్చారు. ఎఫ్‌-15ఈ పైలట్‌ను రక్షించేందుకు నిర్వహించిన ఆపరేషన్‌ వివరాలను ట్రంప్‌ బయటపెట్టారు. 155 విమానాలు ఇందులో పాల్గొన్నాయన్నారు. వీటిల్లో నాలుగు బాంబర్లు, 64 ఫైటర్లు, 48 రీఫ్యూయలింగ్‌ విమానాలు, 13 రెస్క్యూ విమానాలు కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఇరాన్ చేతికి చిక్కకుండా వంద మిలియన్‌ డాలర్ల విమానాన్ని అమెరికా విమానాలను ధ్వంసం చేసింది. ఈ ఘటనతో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధింపు

దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది

యుద్ధం వేళ విశాఖలోని ఇరాన్ విద్యార్థినుల కష్టాలు

నాందేడ్‌లో ఆలయ ప్రసాదంలో విషం.. 150 మందికి అస్వస్థత

US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల వేళ.. ఊహించని అడ్డంకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *