Headlines

ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!


ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఆడుకున్న సరదా ప్రాంక్ అతడిని నేరుగా కటకటాల వెనక్కి నెట్టింది. ప్రియురాలికి చేసిన ఒకే ఒక్క అబద్ధపు మెసేజ్.. అక్రమంగా కోట్లు సంపాదిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ గ్రూప్ గుట్టు రట్టు చేసింది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఆసక్తికర ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దేవినేని సుమంత్ బెంగళూరులో ఉంటూ టెలిగ్రామ్ వేదికగా క్రికెట్ బెట్టింగ్ ప్రిడిక్షన్ గ్రూప్‌ను నడుపుతున్నాడు. ఈ ఛానెల్ ద్వారా బెట్టింగ్ ప్రమోషన్లు చేస్తూ వేల సంఖ్యలో యువకులను సభ్యులుగా చేర్చాడు. ఈ భారీ టెలిగ్రామ్ ఛానెల్‌ను ఉత్తరాదికి చెందిన ఓ వ్యక్తికి రూ.4.6 కోట్లకు విక్రయించేందుకు సుమంత్ డీల్ కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందంలో భాగంగా కొనుగోలుదారుడు సుమంత్‌కు రూ.30 లక్షలు అడ్వాన్స్‌ కూడా ఇచ్చాడు.ఈ డీల్ పూర్తి చేయడం కోసం సుమంత్ వారం క్రితం హైదరాబాద్‌కు వచ్చి.. కేపీహెచ్‌బీ వన్‌సిటీలో నివసించే తన స్నేహితులు మనోజ్, గౌతమ్‌తో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో బెంగళూరులో ఉన్న సుమంత్ గర్ల్‌ఫ్రెండ్.. తను ఎందుకు ఇంకా రావడం లేదని శుక్రవారం ఫోన్ చేసి నిలదీసింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న సుమంత్.. తనను కొందరు కిడ్నాప్ చేసి వన్‌సిటీలో బంధించారంటూ సరదాగా ప్రాంక్ మెసేజ్ చేశాడు. ప్రియుడు పంపిన మెసేజ్‌ను నిజమని నమ్మిన ఆ యువతి తీవ్ర భయాందోళనకు గురై వెంటనే డయల్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన కేపీహెచ్‌బీ పోలీసులు వన్‌సిటీలోని మనోజ్ ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న బ్యాగుల్లో పెద్ద మొత్తంలో నగదు కనిపించడంతో పోలీసులు నిలదీశారు. అయితే ఆ ముగ్గురు యువకులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం బలపడింది. ఆ ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా అసలు విషయం బయటపడింది. కిడ్నాప్ డ్రామా వెనుక భారీ ఆన్‌లైన్ బెట్టింగ్ దందా బయటపడటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎయిర్‌హోస్టెస్ నుంచి పోలీస్ ఆఫీసర్‌గా వచ్చింది.. అవినీతి ఊబిలో చిక్కుకొని..

2026 Lunar Eclipse: ఆగస్టు 28న ఆకాశంలో అద్భుతం.. భారత్‌లో కనిపిస్తుందా?

గంటల తరబడి మొబైల్‌ చూస్తున్నారా? మీ వెన్నెముకకు ముప్పు తప్పదు!

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

Cheque Book New Rules: చెక్ బుక్‌లపై కొత్త రూల్స్.. మీ పాత చెక్ ఇక చెల్లదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *